మహిళల భద్రతపై విస్తృత చర్చ..


Fri,December 6, 2019 01:19 AM

మహిళల భద్రతపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. మంత్రి కేటీఆర్‌ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. టోల్‌ఫ్రీ నం-100కు విస్తృతంగా ప్రచారం కల్పించాలని కోరారు. వైన్‌ షాపుల చుట్టపక్కల ప్రాంతాల్లో మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత వైన్‌ షాపులను మూసి వేయాలన్నారు. పార్కులు, ఖాళీ స్థలాల్లో అసాంఘీక శక్తులకు అడ్డాలుగా మారకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో నాలుగు లక్షల ఎల్‌ఈడీ లైట్లు ఉండగా, అన్ని రోడ్లపై లైటింగ్‌ను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ సమావేశంలో మాట్లాడుతూ, ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలో సమగ్ర రోడ్ల నిర్వహణ పనులు చేపట్టడాన్ని స్వాగతించారు. ప్రజలకు సౌకర్యవంతంగా రవాణా సదుపాయాలు, రోడ్లు ఉంటే ట్రాఫిక్‌ సమస్య ఉండదని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో రోడ్ల నిర్మాణం, నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణ తదితర పనులు ట్రాన్స్‌పోర్ట్‌ విభాగమే చూస్తుందన్నారు. భారత ఉపఖండంలో మాత్రమే ట్రాన్స్‌పోర్టు విభాగం లైసెన్సులు మాత్రమే జారీ చేస్తుందన్నారు. రోడ్ల నిర్వహణ సరిగా లేనందునే మన దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను కూడా ఆధునీకరించేందుకు నిధులు మంజూరు చేయాలని డీజీపీ కోరారు. సమావేశంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తదితరులతోపాటు పోలీసు, వాటర్‌బోర్డు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

98

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles