సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై లైంగికదాడి..


Thu,December 5, 2019 03:57 AM

-నిందితుడు రిమాండ్

దుండిగల్, నమస్తేతెలంగాణ: నగర శివారు, నిజాంపేటలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని బుధవారం బాచుపల్లి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సీఐ జగదీశ్వర్ కథనం ప్రకారం... వైజాగ్ గాజువాకకు చెందిన వెంకట్రావ్ కొడుకు జైచంద్(29) ఏంబీఏను మధ్యలో ఆపేసి ఉద్యోగం కోసం నగరానికి వచ్చి హాఫీజ్‌పేట్‌లో ఉంటున్నాడు. ఈక్రమంలో మాట్రిమోని ద్వారా నిజాంపేటకు చెందిన ఓ ప్రైవేటు టీచర్‌తో పాటు ఆమె చెల్లెలుతో పరిచయం పెంచుకున్నాడు. ప్రైవేటు టీచర్‌తో పెండ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించారు. ఈ క్రమంలో 10 రోజులుగా జైచంద్, టీచర్, ఆమె సోదరితో కలిసి షాపింగ్‌లు చేయడంతో పా టు సినిమా, షికార్లకు వెళ్లారు. కాగా.. మూడు రోజుల క్రితం జైచంద్ నిజాంపేటలో నివాసం ఉంటున్న టీచర్ ఫ్లాటుకు వెళ్లాడు. అప్పటికే టీచర్ స్కూల్‌కు వెళ్లగా, ఆమె చెల్లెలుతో మాట్లాడుతూ అక్కడే ఉండిపోయాడు.

అప్పటికే టీచర్ చెల్లెలుపై కన్నెసిన జైచంద్ .. ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈక్రమంలో ఫ్లాటులో నుంచి అరుపులు వినపడడంతో పక్క ఫ్లాటువారు వచ్చేసరికి జైచంద్ అక్కడి నుంచి ఉడాయించాడు. అదే సమయంలో ఇంటికి చేరుకున్న టీచర్... తన చెల్లెలు సృహకోల్పోయి ఉండడంతో పాటు ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడం గమనించి 100కు డయల్ చేసింది. ఇంట్లో దొంగతనం చోటు చేసుకోవడంతో పాటు తనపై అఘాయిత్యం జరిగినట్లు బాధితు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే విధంగా సెల్‌ఫోన్, బంగారుగొలుసు పోయినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకొని పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు జైచంద్‌పై ఐపీసీ సెక్షన్ 376, రెడ్‌విత్ 511, 452,392,307 కేసులు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.

354

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles