అంతరాయం లేకుండా 24/7 సరఫరా


Wed,December 4, 2019 02:56 AM

-2014 డిసెంబర్ నుంచి గ్రేటర్‌లో కోతల్లేని విద్యుత్
-ఈ డిసెంబర్‌తో ఐదేండ్లు పూర్తి
-గ్రేటర్‌లో సజావుగా సరఫరా
-నిర్వహణ, విపత్తుల సమయంలో మినహామిగతా రోజుల్లో నిరాటంకంగా సరఫరా

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నీళ్లు తాగకపోయినా.. భోజనం చేయకపోయినా కొంత కాలం ఓర్చుకోగలం కాని కరెంట్ లేకుండా క్షణం కూడా ఉండలేం. విద్యుత్ అవసరం అంతటి అత్యవసర వనరుగా మారిపోయింది. ఇలాంటి ప్రాధాన్యత గల విద్యుత్‌ను టీఎస్ ఎస్‌పీడీసీఎల్ అధికారులు కోతల్లేకుండా అందిస్తున్నారు. చీకట్లను తొలిగించి.. వెలుగులు పంచుతున్నారు. గృహ వినియోగదారులు, వ్యాపార, వాణిజ్యవర్గాలు, పరిక్షిశమలు అన్న తేడాల్లేకుండా అందరికి అంతరాయం లేని విద్యుత్‌ను అందిస్తున్నారు. ఇలా ఒకరోజు కాదు..

రెండు రోజులు కాదు.. ఏకంగా ఐదేండ్లుగా అందిస్తుండటం గమనార్హం.
గ్రేటర్‌లో 2014 డిసెంబర్ నుంచి కోతల్లేని విద్యుత్ సరఫరా అందుతున్నది. అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు ఈ డిసెంబర్‌తో ఐదేండ్లు పూర్తయింది. ఈ ఐదేండ్ల కాలంలో సజావుగా విద్యుత్‌ను సరఫరా చేయడం డిస్కం అధికారుల ఘనతగా చెప్పుకోవచ్చు. లైన్ల నిర్వహణ, విపత్తులు సంభవించినప్పుడు తప్పా మిగతా రోజుల్లో నిరాటంకంగా విద్యుత్‌ను అందిస్తుండటం యజ్ఞంగా భావించవచ్చు.

కోటిన్నర మందికి పైగా సేవలు ..
గ్రేటర్‌లో కోటిన్నర మందికి పైగా జనం నివాసముంటున్నారు. వలసలు పెరుగుతుండటం, నగరం విస్తరిస్తుండటంతో విద్యుత్‌కు తీవ్రమైన డిమాండ్ నెలకొంటున్నది. ఒకప్పుడు గ్రామాలుగా ఉన్న ప్రాంతాలన్నీ నేడు రూపురేఖలు మారి పట్టణాలుగా అవతరించాయి. పారిక్షిశామి రంగం విస్తరణకు నోచుకోవడం, కొత్త కొత్త పరిక్షిశమలు వస్తుండటంతో విద్యుత్‌కు తీవ్రమైన డిమాండ్ ఉంటున్నది. అయినా రెప్పపాటు కాలమంతా కూడా కోతలు లేకపోవడం గమనార్హం. నగరంలో ప్రతి రోజు 3400 మెగావాట్ల విద్యుత్ వినియోగమవుతున్నది. వేసవిలో అత్యధికంగా విద్యుత్‌ను వినియోగించిన సందర్భాలున్నాయి. భవిష్యత్‌లో గ్రేటర్‌లో విద్యుత్ డిమాండ్ మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఐటీ కంపెనీలు విస్తరిస్తుండటం, ఫార్మాసిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, కొత్త కొత్త సెజ్‌లు ఏర్పాటవుతుండటం, పరిక్షిశమల విస్తరణతో డిమాండ్ మరింతగా పెరుగబోతున్నది. ఈ నేపథ్యంలో డిమాండ్ 10 వేల మెగావాట్లకు చేరుకునే అవకాశాలున్నట్లుగా నిపుణులు అభివూపాయపడుతున్నారు. ఇంత డిమాండ్ ఉన్నా కోతల్లేకపోవడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు.

పవర్‌హాలిడే నుంచి..
విద్యుత్ కోతలతో గతంలో ఏకంగా రోజులకు రోజులు పవర్‌హాలిడేను ప్రకటించారు. గృహ వినియోగదారులకు రోజుకు 4-6 గంటలు, పరిక్షిశమలకు వారంలో రెండు రోజులు అధికారికంగా కోతలు అమలు చేశారు. కానీ అనధికారికగా అంతకు మించే కోతలు విధించిన సందర్భాలున్నాయి. గ్రేటర్‌తోపాటు శివారు ప్రాంతాల్లో 24 పారిక్షిశామిక వాడలు ఉన్నాయి. వీటిలో సుమారు 4లక్షల యూనిట్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు కరెంట్ అథారిత పరిక్షిశమలే అధికంగా ఉన్నాయి. చిన్న యూనిట్లు కావడంతో ఇవన్నీ విద్యుత్‌పైనే ఆధారపడ్డాయి. ఉమ్మడి ఏపీలో ప్రభుత్వాలు అమలు చేసిన పవర్‌హాలిడేతో పారిక్షిశామిక రంగం మొత్తం ఇబ్బందుల్లో పడింది. ఏండ్ల తరబడి సంక్షోభంలోకి నెట్టబడ్డాయి. కేవలం కోతల కారణంగానే నెలకు రూ.500కోట్లకు పైగా ఉత్పత్తులు నిలిచిపోయిన పరిస్థితి ఉండేది. కోతలతో పరిక్షిశమలను నడుపలేక కుటీర పరిక్షిశమలు నిర్వహించే వారు ఆత్మహత్యలకు పాల్పడ్డ సందర్భాలున్నాయి. గత ఐదేండ్లుగా గృహ వినియోగదారుల నుంచి మొదలుకుని, పారిక్షిశామిక రంగం వరకు కోతల్లేని విద్యుత్‌ను అందిస్తుండటంతో ఉపశమనం పొందుతున్నారు.

రూపాయి పెంచకుండానే..
డిమాండ్ తీవ్రంగా ఉన్నా.. కోతల్లేకుండా విద్యుత్‌ను అందించినా డిస్కం అధికారులు విద్యుత్ చార్జీలు పెంచకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. రూపాయి పెంచకుండానే, వినియోగదారులపై భారం వేయకుండానే పాత విద్యుత్ చార్జీలనే కొనసాగిస్తున్నారు. అంతరాయం లేని విద్యుత్ సరఫరాలో డిస్కం అధికారుల కృషి అజరామరమైనది. పూర్తిస్థాయిలో ఉద్యోగులు లేక పోయినా.. డబుల్ డ్యూటీలు చేసి మరీ ఉద్యోగులు విద్యుత్‌ను అందించారు. ఉత్పత్తి నుంచి మొదలుకొని సరఫరా వరకు అందరూ సమష్టిగా కృషి చేశారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికుడి నుంచి ఛీప్ ఇంజినీర్ వరకు అందరూ అహర్నిషలు శ్రమించడంతోనే ఇది సాధ్యమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సరఫరా వ్యవస్థను మెరుగుపరిచారు. కనెక్షన్ల సంఖ్య పెరుగుతున్నకొద్దీ వ్యవస్థీకరిస్తూ వస్తున్నారు.

2014లో గ్రేటర్‌లో
విద్యుత్ సరఫరా ఇలా..
రోజుకు విద్యుత్ వినియోగం : 49.56 మిలియన్ యూనిట్లు
(2200మెగావాట్లు)
సెక్షన్లు : 06
ఆపరేషన్ డివిజన్లు : 19
సబ్ డివిజన్లు : 56
ఆపరేషన్ సెక్షన్లు : 180
33/11 కేవీ సబ్‌స్టేషన్లు : 337
గృహ వినియోగదారులు : 31,15,614
కమర్షియల్ కనెక్షన్లు : 5,12,487
ఇండస్ట్రీయల్ కనెక్షన్లు : 1,04,250
కుటీర పరిక్షిశమలు : 735
వీధి దీపాల కనెక్షన్లు : 30,140
జనరల్ కేటగిరి : 8,696
హైటెన్షన్ కనెక్షన్లు : 5,118
2019లో గ్రేటర్‌లో
విద్యుత్ సరఫరా ఇలా..
రోజుకు విద్యుత్ వినియోగం : 74 మిలియన్ యూనిట్లు ( 3400 మెగావాట్లు )
సెక్షన్లు : 09
ఆపరేషన్ డివిజన్లు : 26
సబ్ డివిజన్లు : 65
ఆపరేషన్ సెక్షన్లు : 189
33/11 కేవీ సబ్ స్టేషన్లు : 453
గృహ వినియోగదారులు : 45,44,755
కమర్షియల్ కనెక్షన్లు : 7,16,620
ఇండస్ట్రీయల్ కనెక్షన్లు : 41,405
కుటీర పరిక్షిశమలు : 743
వీధి దీపాల కనెక్షన్లు : 41,983
జనరల్ కేటగిరి : 2,236
హైటెన్షన్ కనెక్షన్లు : 7,417

318

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles