దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


Wed,December 4, 2019 02:52 AM

కంటోన్మెంట్, నమస్తే తెలంగాణ : దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లాడ్డి అన్నారు. ప్రపంచ దివ్యాంగుల సంక్షేమ దినాన్ని పురస్కరించుకొని మంగళవారం బోయిన్‌పల్లిలోని జాతీయ మానసిక దివ్యాంగుల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జీవితంలో ఎదుగుదలకు వైకల్యం ఆటంకం కాదన్నారు. వైకల్యం ఏ రూపంలో ఉన్నా సమాజం, మనుషులు, మన పరిసరాల గురించి ఆలోచించి ముందుకు అడుగులు వేయాలని మంత్రి సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. జాతీయ మానసిక దివ్యాంగుల కేంద్రంలో విద్యతోపాటు ఆరోగ్యపరంగా దివ్యాంగులకు విశేష సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు పలు కిట్లను అందజేశారు. కార్యక్షికమంలో బోయిన్‌పల్లి మార్కెట్ చైర్మన్ టి.ఎన్.శ్రీనివాస్, డైరెక్టర్ శర్విన్‌కుమార్, నీపెడ్ డైరెక్టర్ అనురాధ దాల్మియా, డిప్యూటీ డైరెక్టర్ రామ్‌కుమార్, టీఆర్‌ఎస్ నాయకుడు టింకుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బోధనోపకరణలు మంత్రి చేతుల మీదుగా అందజేశారు.

270

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles