ఘనంగా దివ్యాంగుల సంక్షేమ దినం


Wed,December 4, 2019 02:52 AM

-జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావుకు రోల్ మోడల్ అవార్డు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ముషీరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంవూదభారతిలోని ఆడిటోరియంలో మంగళవారం ప్రపంచ దివ్యాంగుల సంక్షేమ దినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్షికమంలో 20 ఏండ్ల పాటు దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతూ ఎన్నో హక్కులను సాధించిన అఖిలభారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావుకు హోంమంత్రి మహమూద్‌అలీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి రోల్ మోడల్ అవార్డును అందించారు. ఈ సందర్భంగా మంత్రులు దివ్యాంగులకు వీల్‌చైర్లను అందజేశారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ..కొల్లి నాగేశ్వరరావు దివ్యాంగుల కోసం మాస పత్రికను ప్రారంభించి నిరాటంకంగా నడుపుతున్నారని కొనియాడారు. అంతే కాకుండా ఏడేండ్లుగా దివ్యాంగుల హక్కులపై అవగాహన కల్పిస్తూ అవేర్‌నెస్ వాక్‌ను కొనసాగిస్తున్నారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో హక్కుల సదస్సులు, సంక్షేమ పథకాలపై చర్చలు నిర్వహిస్తూ, పదేండ్లుగా పదవ తరగతి, ఇంటర్‌లో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందజేస్తూ దివ్యాంగులకు అండగా ఉంటున్నాడని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కక్షుతి కార్యక్షికమాలు, డ్యాన్స్‌లు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

246

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles