కోటి దీపాల కాంతుల్లో..రాజన్న కల్యాణం


Tue,November 19, 2019 03:06 AM

కవాడిగూడ, నవంబర్‌ 18 : కార్తిక మాసాన్ని పురస్కరించుకొని భక్తి టీవీ ఆధ్వర్యంలో తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం)లో నిర్వహిస్తున్న కోటిదీపోత్సవంలో సోమవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. కైలాస వాహనంపై ఉత్సవ మూర్తుల ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు వేదికపై ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి మహాభస్మార్చన నిర్వహించారు. కొండవీటి జ్యోతిర్మయి బృందం భక్తిగీతాలను ఆలపించగా, శ్రీ చాగంటి కోటేశ్వర్‌రావు తన ప్రవచనామృత ధారను భక్తులపై కురిపించారు. కోటిదీపోత్సవంలో పాల్గొన్న స్వామి సుందర చైతన్యానంద భక్తులకు అణుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠాగోపాల్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పాల్గొని స్వామి సుందర చైతన్యానంద, ఎన్‌టీవీ అధినేత నరేంద్ర చౌదరితో కలిసి కార్తిక దీప జ్యోతులను వెలిగించారు. అనంతరం ప్రాంగణంలోని భక్తులు కార్తిక దీపారాధన చేశారు. కోటి దీప కాంతులతో తెలంగాణ కళాభారతి
ప్రాంగణంలో ఆధ్యాత్మిక వెలుగులు ప్రకాశించాయి.

264

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles