నిరుద్యోగ యువతకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ


Tue,November 19, 2019 03:03 AM

ఎర్రగడ్డ: నిరుద్యోగ యువత, విద్యార్థులకు కంప్యూటర్‌ కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు శ్రీరాంనగర్‌కు చెందిన ‘లెటజ్‌ సర్వ్‌ ఫౌండేషన్‌' ప్రతినిధి మహమూద్‌ అలీ తెలిపారు. ఉపాధిని పొందటానికి కావాల్సిన కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌, ఎమ్మెస్‌ ఆఫీస్‌, ఇంటర్నెట్‌, డీటీపీ, స్పోకెన్‌ ఇంగ్ల్లిష్‌, కెరీర్‌ గైడెన్స్‌ తదితర అంశాల్లో ఉచితంగా శిక్షణ ఉంటుందన్నారు. ఇవే కాకుండా ప్రతి శనివారం పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. పైఅంశాల్లో శిక్షణ పూర్తయిన తర్వాత సర్కార్‌ జారీ చేసే సర్టిఫికెట్‌ను అందజేయటం జరుగుతుందన్నారు. కోర్సులలో శిక్షణ పొందటానికి 8, 10వ తరగతి విద్యార్థులు, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ విద్యార్థులు అర్హులని తెలిపారు. వివరాల కోసం శ్రీరాంనగర్‌లోని ఎస్‌డీ పాయింట్‌ హోటల్‌ సమీపంలోని కార్యాలయంలో సంప్రదించాలని లేదా 9849731084 నంబరుకు ఫోన్‌ చేయాలని కోరారు.

255

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles