పక్కా ప్రణాళిక, స్మార్ట్ వర్క్‌తోనే విజయం


Mon,November 18, 2019 04:50 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమ య్యే ప్రతీ విద్యార్థి ఒక ప్రణాళిక, క్రమశిక్షణతో స్మార్ట్ వర్క్ చేయగలిగితే తప్పక విజయం వరిస్తుందని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కనిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. ఆదివారం బషీర్‌బాగ్‌లోని బాబూఖాన్ ఎస్టేట్‌లో అగర్వా ల్‌సమాజ్ ఆధ్వర్యంలో పలువురు సివిల్స్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్రేయిన్ ఐఏఎస్ సంస్థ డైరెక్టర్ నిహారికారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సం దర్భంగా నవీన్‌మిట్టల్ మాట్లాడుతూ సివిల్స్ సర్వీసెస్ కోసం సన్నద్ధమయ్యే వారికి సమాజసేవపై ఉన్నత అభిప్రాయాలుండాలన్నారు. ఆ అవకాశం సివిల్ సర్వెంట్లకు మాత్రం ఉద్యోగంతో పాటే వస్తుందన్నారు. తాను సర్వీసు సాధించేందుకు రోజూ 3 విడుతలుగా మొత్తం 15 గంట లు చదివే వాడినన్నారు. తాను మొదటి ప్రయత్నంలోనే 3వ ర్యాంకు సాధించానన్నారు. అదేవిధంగా అందరూ కేవలం సర్వీసు కోసం కాకుండా మొదటి ర్యాంకు కోసం సన్నద్ధం కావాలన్నారు. నిహారికారెడ్డి మాట్లాడుతూ విజయం సాధించేందుకు మొదట్లో ఉన్న పట్టుదలే నిరంతరంగా కొనసాగించాలన్నారు.


తన విద్యార్థుల్లో ఉద్యోగం చేస్తూ రోజుకు 5 గంటలు మాత్రమే చదివి ఉద్యోగం సాధించిన వారు కూడా ఉన్నారని గుర్తు చేశారు. ఉద్యోగానికి అన్ని సబ్జెక్టులు చాలా ముఖ్యమైనవేనన్నారు. దేశం లో ఎగ్జిక్యూటివ్‌లే పాలసీ నిర్మాతలని రాజకీయ నాయకులు శాసనసభల్లో చట్టాలు చేయాలంటే అందుకు కావాల్సింది ఐఏఎస్ అధికారులేనని అన్నారు. రాజకీయ నాయకులు తాత్కాలిక అధికారం గల వారని కానీ ఎగ్జిక్యూటివ్‌లు మాత్రం నిరంతరం వృత్తిలో కొనసాగుతారని గుర్తు చేశారు. అలాంటి అధికారులకు అందరికంటే ఎక్కు వ ఙ్ఞానం అవసరమన్నారు. ఎవ్వరు సలహాలు ఇచ్చినా అవి కేవలం సలహాలుగా మిగిలిపోతాయని కానీ ఎగ్జిక్యూటివ్‌లు ఇచ్చే సలహాలు మాత్రం చట్టాలుగా రూపొందుతాయన్నారు. అలాంటి ఉన్నత ఉద్యోగాన్ని సాధించాలం టే ఎంతో పట్టుదలతో లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలన్నారు. ఎవ్వరికీ నేను సాధించగలనా అనే అపనమ్మకం ఉండకూడదన్నారు. ఒకవేళ బాగా చదివినా సర్వీస్ రాకుంటే దేశం లో ఉన్న ఉన్నత ఉద్యోగాల్లో ఏదో ఒకటి సాధిస్తారని సూచించారు. సరైన పద్ధతి, క్రమశిక్షణ ఉంటే 21ఏండ్ల వయసులోనే ఐఏఎస్‌గా విజయం సాధించొచ్చన్నారు.

279

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles