విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరం


Thu,November 14, 2019 04:19 AM

తుక్కుగూడ: విద్యార్థులకు చదువుతో పాటు, క్రీడలు ఎంతో అవసరమని రంగారెడ్డి జడ్పీచైర్‌పర్సన్ తీగల అనితాహరినాథ్ రెడ్డి అన్నారు. బుధవారం తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని రావిరాల జడ్పీపాఠశాలలో జరిగిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతి మండల కేంద్రంలో విద్యార్థులు ఆడుకోవడానికి విశాలమైన మైదానం ఏర్పాటు చేయనుందన్నారు. అధికంగా ఫీజులు వసూలు చేసే ప్రైవేటు పాఠశాలలకు ఎక్కడా క్రీడా స్థలాలు లేవన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే ఆట స్థలాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆమె వివిధ జిల్లా నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.


ఉమ్మడి 10జిల్లాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. 65వ అండర్ 17 బాల బాలికల ఖోఖో పోటీలు శుక్రవారం వరకు జరుగనుండగా, 250 మంది విద్యార్థులు, 45 మంది పీఈటీలు ఆయా స్కూళ్ల సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, టోర్నమెంట్ ఆర్గనైజర్ చంద్రశేఖర్‌రెడ్డి, స్థానిక ప్రధానోపాధ్యాయులు రఘు, రాఘవరెడ్డి, భాస్కర్‌రెడ్డితో పాటు స్థానిక నాయకులు రవీందర్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి,సురేశ్, సురేశ్,టీఆర్‌ఎస్ నాయకులు రాజు,చంద్రశేఖర్‌రెడ్డి పలు ఏర్పాట్లు చేశారు. కడపటి వార్తలు అందేవరకు హైదరాబాద్ జట్టు పై రంగారెడ్డి బాలుర జట్టు గెలుపొందింది. కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణ, రాఘవేందర్ రెడ్డి, రఘు, సుధాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి , విజయ్ తదితరులు పాల్గొన్నారు.

228

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles