వ్యవస్థగా పోరాడితేనే సాధిస్తాం


Mon,November 11, 2019 12:30 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పదవులు అలంకారం కోసం కాదని చాలా బాధ్యతలతో కూడి ఉంటాయని అన్నారు సినీనటుడు రాజశేఖర్. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జనరల్ సమావేశానికి హీరో రాజశేఖర్, సినీ దర్శకుడు, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్.శంకర్ మాట్లాడుతూ వ్యక్తులుగా ఏది సాధించలేమని, వ్యవస్థగా ఏర్పడి పోరాడితేనే ఏదైనా సాధించుకోవచ్చని పేర్కొన్నారు. అసోసియేషన్ ఏర్పడి యాభై ఏండ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 14న గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి తెలిపారు. అసోసియేషన్ సభ్యులకు రాజశేఖర్, జీవిత, శంకర్ గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఈ జనార్దన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు డీజీ. భవాని, జాయింట్ సెక్రటరీ మడూరి మధు, ట్రెజరర్ భూషణ్, బీఏరాజు, సాయి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

198

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles