సైనికుల త్యాగాలు మరువలేనివి..


Mon,November 11, 2019 12:29 AM

సుల్తాన్‌బజార్, నవంబర్ 10 : ప్రపంచ యుద్ద పోరాటంలో భారతీయ సైనికులు చేసిన త్యాగాలు మరువరాదని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ (టీఎస్, ఏపీ) డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ పేర్కొన్నారు. ఆదివారం చాదర్‌ఘాట్‌లోని విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్ద ఉన్న అమర సైనికుల స్తూపం వద్ద బ్రిటీష్ డిప్యూటీ కమిషన్ హైదరాబాద్, ఇంటాక్ హైదరాబాద్, జీహెచ్‌ఎంసీల ఆధ్వర్యంలో రిమెంబర్స్ సన్‌డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆండ్రూ ఫ్లెమింగ్ పొలిటికల్ ఎకనామి అడ్వైజర్ నలిని రఘురామన్, ఇంటాక్ హైదరాబాద్ కన్వీనర్ సి. అనురాధారెడ్డి, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ, కార్పొరేటర్ మమతా గుప్త, హెడ్ ఆఫ్ కెనేడియన్ ట్రేడ్ విక్రమ్‌జైన్ హాజరై నివాళులర్పించారు. చరిత్రను పరిరక్షించడంతో పాటు ఆ స్ఫూర్తిని భవిష్యత్‌లో బావితరాలకు తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రేయ, స్పోర్ట్స్ డైరెక్టర్ ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

171

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles