అంకితభావంతో పనిచేస్తే అగ్రస్థానం


Wed,October 23, 2019 01:16 AM

మేడ్చల్‌ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి/శామీర్‌పేట: అధికారులు, ప్రజాప్రతినిధులు అంకితభావంతో పనిచేస్తే రాష్ట్రంలోనే మేడ్చల్‌ జిల్లా అగ్రస్థానంలో ఉంటుందని కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. అభివృద్ధిలో జిల్లాను ప్రథమస్థానంలో నిలపుపాలనే లక్ష్యంతో ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. 30 రోజుల ప్రణాళిక అమలులోభాగంగా ఉత్తమ పంచాయతీలకు అవార్డులు ప్రదానం చేసేందుకు గానూ జిల్లా పం చాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం శామీర్‌పేటలోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యే క సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రగతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న 30రోజుల ప్రణాళిక కార్యక్రమం మేడ్చల్‌ జిల్లాలో విజయవంతమైందన్నారు.


ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేసినప్పుడే సమాజంలో మంచిగుర్తింపు రావడంతోపాటు మున్ముందు ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులందరు పోటీ తత్వంతో పని చేయాలన్నారు. 30 రోజుల కార్యక్రమంలో సర్పంచ్‌లు జిల్లా కలెక్టర్‌ ఎంవీ.రెడ్డిని ప్రిన్సిపాల్‌గా చూశారని, కలెక్టర్‌ ప్రత్యేక చొరువతో నేడు ఉత్తమ ఫలితాలను మేడ్చల్‌ జిల్లా నమోదు చేసుకుందన్నారు. గత మూడేండ్లుగా హరితహారం నిర్వహిస్తున్నామని, 30 ప్రణాళిక ద్వారా పారిశుధ్యం, హరితహారం, అభివృద్ధి కార్యక్రమాలతో మారుమూల పల్లెల రూపు రేఖలు మారాయన్నారు. విద్యుత్‌ శాఖ సూపర్‌గా పనిచేసిందని ఎన్నో ఏండ్లుగా పరిష్కారం కానీ సమస్యలను కేవలం 30 రోజులలోనే పరిష్కరించామన్నారు. మిగిలిన కొంతపనులు సైతం పూర్తి చేసి గ్రామాల్లో మెరుగైన సేవలందించాలన్నారు. కాగా 61 గ్రామాల్లో మొత్తం రూ.4.16కోట్లను దాతల సహకారంతో వచ్చాయన్నారు. భవిష్యత్తు ప్రణాళిక కోసం రూ.2కోట్లు మంజూరయ్యాయని, ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్‌ ఇస్తామన్నారు. ఏప్రిల్‌లోపు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.

ప్రణాళిక స్ఫూర్తితో ముందుకు...
జడ్పీచైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, కలెక్టర్‌ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళిక స్ఫూర్తితో గ్రామ పాలకవర్గాలు ముందుకెళ్లాలన్నారు. అందరి భాగస్వామ్యంతో అద్భుతంగా చేశారన్నారు. గ్రామాల్లో పారిశు ధ్యం, హరితహారం పనులు నిరంతరం కొనసాగించాలన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం జడ్పీ నిధులను కేటాయిస్తానని ప్రకటించారు.

173

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles