మోకిలలో హెచ్‌ఎండీఏ వెంచర్


Tue,October 22, 2019 05:43 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రియల్ మార్కెట్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుని సంస్థ ఖజానాను మరింత బలోపేతం చేసుకునే దిశగా హెచ్‌ఎండీఏ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ఉప్పల్ భగాయత్‌లో 72 ఎకరాల్లో కమర్షియల్ లే అవుట్‌ను అభివృద్ధి చేసి ఇటీవల ప్లాట్ల వేలం ద్వారా దాదాపు రూ.650 కోట్ల మేర ఆదాయాన్ని రాబట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే శంకర్‌పల్లి జోన్ పరిధిలోని సంస్థకు సంబంధించి మోకిలలో సర్వే నంబరు 96 సుమారు 45 ఎకరాల మేర స్థలం ఉంది. ప్రస్తుతం ఈ స్థలంలో అర్బన్ ఫారెస్ట్రీకి సంబంధించి నర్సరీ ఉంది. ఈ క్రమంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా ఈ మోకిల ఉండడంతో ఇక్కడి ప్లాట్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో భాగంగానే లే అవుట్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ప్రతిపాదనను పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ లే అవుట్ ఏర్పాటుపై మరింత స్పష్టత రానున్నది.

339

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles