పేదలకు రూ.2 వందలకే డయాలసిస్‌


Sun,October 13, 2019 01:27 AM

సుల్తాన్‌బజార్‌: నిరుపేద కిడ్నీ వ్యాధిగ్రస్తులకు భగవాన్‌ మహావీర్‌జైన్‌ రిలీఫ్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ కేవలం రెండు వందల రూపాయలకే డయాలసిస్‌ను నిర్వహించడం అభినందనీయమని సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌ (ఎస్‌పీఎంఐసీఎల్‌) డైరెక్టర్‌ అజయ్‌కుమార్‌ శ్రీవాత్సవ పేర్కొన్నారు. శనివారం కింగ్‌కోఠి జిల్లా దవాఖాన ప్రాంగణంలోని భగవాన్‌ మహావీర్‌ డయాలసిస్‌ సెంటర్‌కు సీఎస్‌ కేంద్ర ప్రభుత్వ సహకారంతో సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌ హైదరాబాద్‌ శాఖ ఆధ్వర్యంలో ఆరు డయాలసిస్‌ యంత్రాలను అందజేశారు. కార్యక్రమానిక ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన డయాలసిస్‌ యంత్రాలను ప్రారంభించిన అనంతరం కిడ్నీ వ్యాధిగ్రస్తులతో ముచ్చటించారు. అనంతరం మాట్లాడుతూ డయాలసిస్‌ అంటేనే వేల రూపాయల ఖర్ఛుతో కూడుకున్నదన్నారు. పేద రోగులకోసం తమ సంస్థ ఆధ్వర్యంలో 30లక్షల విలు వ చేసే ఆరు డయాలసిస్‌ యంత్రాలను భగవాన్‌ మహావీర్‌ డయాలసిస్‌ సెంటర్‌కు అందజేశామన్నారు.


పేద కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఎన్నో సేవలను అందిస్తున్న మహావీర్‌ డయాలసిస్‌ సెంటర్‌తోపాటు తాము సేవలను అం దించడం గర్వించదగ్గ విషయమన్నారు. త్వరలో ఆం కాలజీ సెంటర్‌ను ప్రారంభించేందుకు శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. నిరుపేదలకు ఆపన్నహస్తం ఇస్తున్న మహావీర్‌ జైన్‌ రిలీఫ్‌ట్రస్టుకు రెండు కోట్ల వ్యయంతో సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని సేవలను అందజేస్తామని వివరించారు. కార్యక్రమంలో ఎస్‌పీఎంఐసీఎల్‌ జనరల్‌ మేనేజర్‌ బోలేవార్‌బాబు, తివారి, కృష్ణమోహన్‌, కృష్ణ ప్రసాద్‌, ట్రస్టీలు పీసీ పారక్‌, ఇందర్‌చంద్‌జైన్‌, సతీష్‌కివసారా, ప్రశాంత్‌ శ్రీమల్‌, సుశీల్‌ కపాడియా పాల్గొన్నారు.

93

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles