రేపు గుప్పెడంత గుండెలో..


Thu,October 10, 2019 02:39 AM

రవీంద్రభారతి : ప్రముఖ సాంస్కృతిక సంస్థ సత్కళా భారతి 23వ వార్షికోత్సవం సందర్భంగా 11న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో గుప్పెడంత గుండెలో..నాటక ప్రదర్శన ఉంటుందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సత్కళాభారతి సత్యనారాయణ బుధవారం తెలిపారు. ప్రముఖ గుండె శస్త్ర చికిత్స నిపుణులు పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. గోపాలకృష్ణ గోఖలే ప్రథమ అవయవ మార్పిడి శస్త్ర చికిత్స పై యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ నాటకం మానవత్వపు విలువలకు అద్ధం పడుతుందని నిర్వాహకులు సత్యనారాయణ పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు సభాధ్యక్షులుగా డా.కేవీ రమణాచారి వ్యవహరించనున్నారని, ప్రముఖులు అతిథులుగా పాల్గొననున్నారని నిర్వాహకులు వెల్లడించారు.

177

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles