మంత్ర ముగ్ధం..ఇంద్రజాలం..!!


Tue,October 8, 2019 04:37 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఇంద్రజాలాన్ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా పిల్లలు మ్యాజిక్‌షోలను ఎంతో ఎంజాయ్ చేస్తారు. ముఖ్యం గా భాగ్యనగరంలో ఇంద్రజాలానికి ఎంతో క్రేజ్ ఉంటుంది. ఎలాంటి వేడుకలయినా మెజీషియన్ షో ఉండేలా చూసుకుంటున్నారు. మెజీషియన్స్‌కు భలే ఆదరణ వస్తోంది. అందులో భాగంగానే వీక్షకులను తమ మాయాజాలంతో మెజీషియన్ భాస్కర్ 10 ఏండ్ల నుంచి ఆకట్టుకుంటున్నారు. ఇంద్రజాలాన్ని ఉపాధిగా మలుచుకుని మందమర్రి నుంచి మహానగరానికొచ్చి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.


3 వేల పైచిలుకు షోలు..!!
మందమర్రికి చెందిన ఆయిళ్ల భాస్కర్.. స్థానికంగా ఇంద్రజాలం షోలు చేసేవాడు. చిన్నప్పుడు మెజీషియన్స్ షోలు ఎక్కడైనా జరిగితే తప్పనిసిగా వెళ్లి చూ డటం ఆయనకు అలవాటుగా మారింది. ఆ ఇష్టమే అతడిని ఇంద్రజాలంలోకి ప్రవేశం పొందేలా చేసింది. దేశంలో బెంగళూరు, కలకత్తా, ఢిల్లీ తదితర రాష్ర్టాల్లో సైతం భాస్కర్ షోలు చేశాడు. ఇప్పటివరకకు 3వేల పైచిలుకు షోలు చేశాడు. దర్శకుడు త్రివిక్రమ్, అల్లుఅర్జున్, రామ్‌చరణ్, దివంగత కవి సినారె తదితర ప్రముఖుల వద్ద ఇంద్రజాలం ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నాడు.

329

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles