జాతీయస్థాయి డిప్ల్లొమా కోర్సులకు ఎంపికైన ముద్రా ఉద్యోగులు


Tue,October 8, 2019 04:34 AM

కాచిగూడ: ముద్ర అగ్రికల్చరల్ అండ్ స్కిల్ డవలప్‌మెంట్ మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌లో అత్యుత్తమ సేవలు అందించిన నలుగురు ఉద్యోగులు ఢిల్లీలోని నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి డిప్ల్లొమా కోర్సుల శిక్షణకు ఎంపికైనట్లు సొసైటీ చైర్మన్ తిప్పినేని రామదాసప్పనాయుడు అన్నారు. సోమవారం బర్కత్‌పురలోని సంస్థ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్‌సీయూఐ అధికారులు ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా 35మందిని ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో 3 నెలలపాటు శిక్షణ ఇస్తున్నారని, అందులోభాగంగా ముద్ర కోఆపరేటివ్ సొసైటీకి చెందిన పి.నాగరాజు, జి.మహేందర్, బి.రాజకుమార్‌రెడ్డి, టి.పావనిక ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు. దేశం నుంచి 17 మందిని ఎంపిక చేసి, వినియోగదారులకు ఉత్తమ సేవలను అందించినందు కు ముద్ర కోఆపరేటివ్ సొసైటీ సంస్థను గుర్తించి నలుగురు ఉద్యోగులను గుర్తించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన శిక్షణ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా రాజ్యసభ సభ్యుడు, ఎన్‌సీయూఐ ఛైర్మన్ చంద్రపాల్‌సింగ్, గుజరాత్ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ టీహెచ్.అమిత్, మణిపూర్ ఐఏఎస్ అధికారి ఆర్‌ఎస్ క్షేత్ర మయూఫ్, ఎన్‌సీయూఐ సీఈఓ ఎస్.సత్యనారాయణ హాజరైనట్లు ఆయన తెలిపారు.

86

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles