గ్రేటర్‌ ఆర్టీసీకి ఆర్థిక జవసత్వాలు


Mon,October 7, 2019 04:56 AM

-నష్టాలను భరిస్తామన్న సీఎం కేసీఆర్‌
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగర ప్రజలను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చుతున్న ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీకి భారీ అండదండలు లభించాయి. ప్రభుత్వం నుంచి భరోసాతో పాటు, ఆర్థిక జవసత్వాలు చేకూరాయి. ఇన్నాళ్లుగా నష్టాలతో కుదేలైన గ్రేటర్‌ జోన్‌ ఆపరేషన్స్‌ ఇక నుంచి పరుగులు పెట్టబోతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆర్టీసీ నిర్వహణ వల్లే వచ్చే నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్‌ ఆదివారం భరోసానిచ్చారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం నష్టాలను ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. గ్రేటర్‌లో 29 డిపోలుండగా, 3519 బస్సులను నడుపుతున్నారు. ఇలా ప్రతిరోజు 35 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. ప్రతిరోజు గ్రేటర్‌ ఆర్టీసీకి రూ. 2.5 కోట్ల ఆదాయం వస్తున్నప్పటికి నిర్వహణ ఖర్చులు రోజుకు రూ. 3.5 కోట్లుగా భారమవుతున్నాయి. ఇలా ప్రతిరోజు కోటి రూపాయల నష్టం వస్తున్నది. ఇది ఆర్టీసీకి పెనుభారంగా మారడంతో ఆర్టీసీ ఆపసోపాలు పడుతున్నది. ఈ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని సాక్షాత్తు సీఎం ప్రకటించడంతో ఆర్టీసీకి ప్రాణం పోసినట్లయ్యింది. గ్రేటర్‌ పట్టణ ప్రాంతం కావడంతో నష్టాలు వస్తున్న దృష్ట్యా ప్రభుత్వమే భరోసానివ్వడంతో గ్రేటర్‌లో ప్రగతిరథచక్రాలు పరుగుపెట్టడానికి అస్కారముంటుందని ఆర్టీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

1628

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles