ఫెన్సింగ్‌ క్రీడా అభ్యున్నతికి కృషి


Mon,October 7, 2019 04:55 AM

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి : ఫెన్సింగ్‌ క్రీడా అభ్యున్నతి కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని ఇండియన్‌ ఫెన్సింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు, ఓఏఐ కార్యదర్శి రాజీవ్‌ మెహతా అన్నారు. గచ్చిబౌలిలో తెలంగాణ ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫెన్సింగ్‌ అకాడమీలు ఏర్పాటు చేసి తద్వారా క్రీడ అభ్యున్నతికి హైదరాబాద్‌ నుంచి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌ వేదికగా కామన్వెల్త్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌ను నిర్వహించనున్నట్లు రాజీవ్‌ మెహతా ప్రకటించారు. 25 దేశాల నుంచి వెయ్యి మంది ఫెన్సింగ్‌ క్రీడాకారులు పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలను ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో ఫెన్సింగ్‌ అకాడమీలను ఏర్పాటు చేసేందుకు సీనియర్ల సహకారం తీసుకుంటామన్నారు. తెలంగాణ హ్యాండ్‌బాల్‌ అధ్యక్షుడు, అక్షర ఇంటర్నేషనల్‌ స్కూల్‌ చైర్మన్‌ జగన్‌మోహన్‌రావు, తెలంగాణ ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కె.జగదీశ్వర్‌యాదవ్‌, ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ మాజీ కార్యదర్శి ఎస్‌ఆర్‌ ప్రేమరాజ్‌, తెలంగాణ జిమ్నాస్టిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కె.మహేశ్‌, తెలంగాణ ఖోఖో కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొన్నారు.

166

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles