ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు :ట్రై పోలీస్ కమిషనర్లు

Sat,September 14, 2019 04:35 AM

అంగరంగ వైభవంగా గణేశ్ నామ స్మరణతో శుక్రవారం మధ్యాహ్నం వరకు హుస్సేన్‌సాగర్ వద్ద నిమజ్జన కార్యక్రమాలు కొనసాగాయి. గురువారం రాత్రంతా ట్రై కమిషనరేట్ల పరిధిలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రతిష్టాత్మకమైన వినాయక నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయడంలో ప్రజలు, మండపాల నిర్వాహకులు, భాగ్యనగర ఉత్సవ కమిటీ సహకారం ఎంతో ఉందని, పోలీసులు తీసుకున్న ప్రతి చర్య గూర్చి ప్రజల్లోకి తీసికెళ్లి, ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా పాత్ర చెప్పలేనిదని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్‌భగవత్, సజ్జనార్‌లు అన్నారు.

గణేశ్ నవరాత్రి వేడుకల్లో పాల్గొని విజయవంతంగా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసి, ప్రశాంతతకు మారుపేరుగా హైదరాబాద్‌ను చాటిచెప్పిన ప్రతి పోలీస్ సిబ్బందికి కమిషనర్లు అభినందనలు తెలిపారు. విఘ్నాలు లేకుండా నిమజ్జనం నిర్వహించడంలో ప్రజల సహకారం ఎంతో ఉందని, టెక్నాలజీ, కమ్యూనిటీ పోలీసింగ్‌తో ప్రశాంతమైన నిమజ్జనోత్సవం సాధ్యమైందన్నారు. నిమజ్జన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తికావడంతో ముగ్గురు పోలీస్ కమిషనర్లు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు

173

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles