రైల్వేస్టేషన్‌ను సందర్శించిన జాతీయ మీడియా ప్రతినిధులు

Sat,September 14, 2019 04:34 AM

కాచిగూడ : శుక్రవారం 32 మంది జాతీయ మీడియా ప్రతినిధులు కాచిగూడ రైల్వేస్టేషన్ 1 నుంచి 4వ ప్లాట్ ఫామ్‌లోని ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్, మాసజ్ చైర్స్, లాండ్రీ ప్లాంట్, రైల్వే మ్యూజియం, ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే గదులు, మూత్రశాలలు, పలు స్టాళ్లను సందర్శించి రైల్వే సంస్థ అందిస్తున్న సౌకర్యాల గూర్చి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ డివిజన్ రైల్వే ఏడీఆర్‌ఎం ఇన్‌ఫ్రా సాయిప్రసాద్, సీనియర్ డీసీఎం వెంకన్న, సీనియర్ డీఓఎం రాజ్‌కుమార్, సీనియర్ డీఈఎన్ మోతీలాల్ భూక్యా వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

162

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles