ఓయూ ప్రొఫెసర్‌కు ఇంజినీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

Sat,September 14, 2019 04:33 AM

ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం హెడ్ ప్రొఫెసర్ జి.మల్లేశంను ఇంజినీర్ ఆఫ్ ది ఇయర్-2019 అవార్డు వరించింది. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) ప్రతీ ఏటా అందించే ఈ అవార్డును ఈ ఏడాదికి గాను ప్రొఫెసర్ మల్లేశానికి అందజేస్తున్నట్లు సంబంధిత అధికారులు వర్తమానం అందజేశారు. భారతరత్న సర్ మోక్షగుం డం విశ్వేశ్వరయ్య 159వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈనెల 17న ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి చేతుల మీదుగా ఈపురస్కారాన్ని అందుకోనున్నారు.

ఓయూలోనే బీఈ(ఎలక్ట్రికల్) పూర్తి చేసిన ఆయన ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. 2002లో ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన ఆయన యూజీసీ నుంచి ప్రతిష్టాత్మక రామన్ ఫెలోషిప్ పథకం కింద తన పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌ను అమెరికాలోని ప్రఖ్యాత యేల్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. గతంలో ఆయన ఇంజినీరింగ్ కళాశాలలో వార్డెన్, స్టూడెంట్ అడ్వైజర్ తదితర బాధ్యతలు నిర్వర్తించారు. ఐఈఈఈకు చెందిన పవర్ ఇంజినీరింగ్ సొసైటీ హైదరాబాద్ చాప్టర్‌కు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఓయూ ఆటోమేషన్ విభాగానికి స్పెషల్ ఆఫీసర్‌గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఆయన రూపొందించిన ఎన్నో పరిశోధన పత్రాలు వివిధ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ఈ సందర్భంగా ఆయనను అధికారులు,అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.

138

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles