సరస్వతీ పుత్రికకు భరోసా..ఆదుకుంటానని ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ హామీ

Sat,September 14, 2019 04:31 AM

కుత్బుల్లాపూర్ : నిరుపేద ఇంటిలో ఓ సరస్వతీ పుత్రిక వెలిసింది. ప్రభుత్వ బడిలో ఓనమాలు దిద్దింది. అత్యధిక మార్కులతో ఎర్రగడ్డ ఈఎస్‌ఐసీ దవాఖానలో ఎంబీబీఎస్ (వైద్య విద్య)సీటు సాధించింది. వివరాల్లోకి వెళ్తే.... కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్‌నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ తెలుగుతల్లినగర్‌కు చెందిన ముదిగొండ లక్ష్మయ్య దంపతులకు నలుగురు సంతానం. దినసరి కూలీ. దీంతో ఆయన పిల్లలందరిని ప్రభుత్వ బడిలో చదివించారు. కాగా రెండో కూతురు సంధ్య బాల్యం నుంచే విద్యలో చక్కటి ప్రతిభ కనబరుస్తూ చదువులో రాణిస్తున్నది. ఇటీవల ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐసీలో ఎంబీబీఎస్ సీటును సాధించింది. అయితే ఆర్థికంగా వెనుకబడిన లక్ష్మయ్య తన కూతురు వైద్యవిద్యకయ్యే ఖర్చు పెట్టలేని పరిస్థితి.

దీంతో సంధ్య భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయం పలువురు లక్ష్మయ్య శ్రేయోభిలాషులు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు ఆయన తన కూతురు సంధ్యతో చింతల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యేను కలిసి తమ బాధను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ సంధ్యను అభినందించారు. సంధ్యకు వైద్యవిద్యకు అవసరమమైన ఆర్థిక సాయం చేస్తానని హామీనిచ్చారు. వెంటనే ఎమ్మెల్యే వైద్యవిద్య ఖర్చులకు రూ.50 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

144

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles