ప్రాజెక్టుల నిర్మాణాల్లో డిజైన్లు కీలకం

Wed,September 11, 2019 12:45 AM

ఖైరతాబాద్‌, సెప్టెంబర్‌ 10 : ప్రాజెక్టుల నిర్మాణాల్లో డిజైన్లు కీలకమని, వాటి ఆధారంగానే క్లిష్టమైన నిర్మాణాలను సైతం సరైన అంచనాతో నిర్మించవచ్చని ఐఐటీ హైదరాబాద్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఉమాశంకర్‌ అన్నారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్యభవన్‌లో ‘డిజైన్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆస్పెక్ట్స్‌ ఆఫ్‌ ఇపార్టెంట్‌ బ్యారేజ్‌ స్ట్రక్చర్స్‌' అనే అంశంపై ఇంజినీర్‌ మాటూర్‌ గోపాల్‌ రావు 22వ ఉపన్యాస సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రాజెక్టులను నిర్మించేటప్పుడు అనేక అంశాలను పరిగణంలోకి తీసుకోవాల్సి వస్తుందని, అక్కడి వాతావరణం, భూసారం తదితర పరీక్షలు చేయాల్సి ఉంటుందన్నారు. కట్టడాలు, బ్యారేజీలు, పంప్‌ హౌజ్‌ల నిర్మాణ సమయంలో అనేక ప్రామానాలను పాటించాల్సి ఉంటుందన్నారు. నిర్మాణానికి కావాల్సిన డిజైన్లను ముందస్తుగా తయారు చేసుకోవాలని, అందులో అన్ని రకాల ప్రాణాలను తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు సైతం ప్రపంచ స్థాయిలో నాణ్యత ప్రామాణాలను పాటించారని, ప్రపంచంలో అతి పెద్ద ప్రాజెక్టులో కాళేశ్వరం ఒకటన్నారు. ఈ సభలో ఐఈఐ చైర్మన్‌ డాక్టర్‌ జి. రామేశ్వర్‌ రావు, కార్యదర్శి అంజయ్య, సహాయ కార్యదర్శి ప్రొఫెసర్‌ రమణా నాయక్‌, సభ్యులు డాక్టర్‌ ఎంవీ వెంకటేశ్వర రావు తదిరతులు పాల్గొన్నారు.

251

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles