జాయింట్ చెక్‌పవర్‌ను రద్దు చేయాలి

Wed,July 24, 2019 12:31 AM

మేడ్చల్ రూరల్: సర్పంచ్‌లకు ఉపసర్పంచ్‌లతో కలిపి ఇచ్చిన జాయింట్ చెక్ పవర్‌ను రద్దు చేసి, పంచాయతీ కార్యదర్శితో ఇవ్వాలని రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదాని భూమన్నయాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం మేడ్చల్ మండలం పూడూరు గ్రామ పరిధిలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలవడానికి ఆయన గృహానికి భూమన్నయాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన సర్పంచ్‌లు వచ్చారు. ఈ సందర్భంగా భూమన్నయాదవ్ మాట్లాడుతూ మంత్రి ఈటల రాజేందర్ ద్వారా తమ విన్నపాన్ని సీఎం కేసీఆర్‌కు తెలిజేయాలని ఇక్కడికి వచ్చామన్నారు. ఉప సర్పంచ్‌లతో కలిపి చెక్ పవర్ ఇవ్వడం వల్ల గ్రామాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంటుందన్నారు. తద్వారా గ్రామాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. రిజర్వు డు స్థానాల్లోని సర్పంచ్‌లపై ఆధిపత్యం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే చెక్ పవర్‌ను ఉపసర్పంచ్‌తో కాకుండా పంచాయతీ కార్యదర్శితో కలిపి ఇవ్వాలని కోరారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి తాము సానుకూలంగా ఉన్నామని, బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు అవుతామన్నారు. చట్టానికి అనుకూలంగా లేని సర్పంచ్‌లను సస్పెండ్ చేసినా బాధపడమన్నారు. ఉపసర్పంచ్‌తో జాయింట్ చెక్ పవర్‌ను రద్దు చేసి, కేరళలలో మాదిరిగా 14 అధికారాలను సర్పంచ్‌లకు బదిలీ చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, మహేందర్, గణేశ్, కరుణాకర్‌రెడ్డి, మల్లేశ్, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, భువనగిరి తదితర జిల్లాలకు చెందిన సర్పంచ్‌లు పాల్గొన్నారు. అయితే అనివార్య కారణాల వల్ల మంత్రి రాలేకపోవడంతో ఆయనను కలవడానికి సచివాలయానికి తరలివెళ్లారు.

204

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles