తెలంగాణ సంస్కృతికి చిహ్నం బోనం

Wed,July 24, 2019 12:27 AM

-తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి
-ఘనంగా కోఠి ఈఎన్‌టీ దవాఖానలో వేడుకలు
సుల్తాన్‌బజార్ : తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బోనం నిలుస్తుందని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యులు వకులా భరణం కృష్ణమోహన్‌రావులు పేర్కొన్నారు. మంగళవారం కోఠి ఈఎన్‌టీ దవాఖానలో నిర్వహించిన బోనాల వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ, నగర శాఖ అధ్యక్షుడు ఆర్.ప్రతాప్, ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, కోఠి ఈఎన్‌టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, టీఎన్జీవో కేంద్రం సంఘం కార్యదర్శి ఎస్.ఉమారెడ్డి, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కేంద్రం సంఘం కార్యనిర్వాహణ కార్యదర్శి కొండల్‌రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీఎన్జీవో ఈఎన్‌టీ యూనిట్ అధ్యక్షుడు తూంకుంట రాజు, శాఖ యూనిట్ ప్రతినిధులు పూజలకు విచ్చేసిన వారిని సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాస్, జేఏసీ చైర్మన్ రవిశంకర్ ప్రజాప్రతి, గాంధీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహారావు, ఆర్‌ఎంవో శేషాద్రి, సరోజిని ఐ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం, డాక్టర్లు రమేశ్, సావిత్రి, శ్రీనివాస్, నరహరి, లాలూప్రసాద్, హైదరాబాద్ డీఎంఅండ్‌హెచ్‌వో వెంకట్, కోఠి ఈఎన్‌టీ టీఎన్జీవో యూనిట్ ప్రతినిధులు కార్యదర్శి విజయ్‌కుమార్, ఉపాధ్యక్షులు రాజేందర్, సంయుక్త కార్యదర్శి దిలీప్, సభ్యులు ఎ.సుజాత, మాధవి పాల్గొన్నారు.

భాగ్యలక్ష్మి దేవాలయంలో...
చార్మినార్ : బోనాల ఉత్సవాల్లో భాగంగా బీసీ కమిషన్ చైర్మన్ బి.ఎస్ రాములు కమిషన్ సభ్యు లు వకుళాభరణంతో కలిసి మంగళవారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు శశికళ ఆలయ మర్యాదలతో బీసీ కమిషన్ చైర్మన్‌తోపాటు సభ్యులు వకుళాభరణాలకు స్వాగతం పలికారు. ఆలయం తో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శశికళ వారికి అమ్మవారి జ్ఞాపికలను అందించారు.

143

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles