5 స్క్రీన్లు.. 1,160 మంది చిన్నారులు

Fri,July 12, 2019 01:57 AM

ఖైరతాబాద్ : అనాథలను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న రెయిన్ బో ఫౌండేషన్ ఇండియా.. ఆ చిన్నారులు ఊహించని కల నెరవేర్చింది. థియేటర్‌లో సినిమా చూపించి వారిలో ఆనందం నింపింది. బుక్ మై స్మైల్ ఫౌండేషన్ సహకారంతో ఈ వినూత్న కార్యక్రమానికి రెయిన్ బో ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది. నిర్మాత రాహుల్ యాదవ్, దర్శకుడు స్వరూప్ ఆర్‌ఎస్‌జే, సంగీత దర్శకులు మార్క్ కె. రాబిన్‌ల ప్రోత్సాహంతో మంచి మెసేజ్‌తో రూపొందించిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రాన్ని చూసి చిన్నారులు సంబరపడిపోయారు. ఆ చిత్రం యూనిట్ సభ్యులు వందలాది మంది విద్యార్థులతో సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడిపారు.

పీవీఆర్ సెంట్రల్ మాల్‌లో..
పంజాగుట్టలోని పీవీఆర్ సెంట్రల్ మాల్‌లో ఉదయం 11 గంటల షోను రెయిన్ బో ఫౌండేషన్ ఇండియాలో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల కోసం కేటాయించారు. మొత్తం ఐదు స్క్రీన్లను వారి కోసం బుక్ చేయగా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రాన్ని ఏక కాలంలో 1,160 చిన్నారులు వీక్షించారు. చిత్రాన్ని చూసి బయటకు వచ్చిన తర్వాత వారి సంతోషాన్ని నమస్తే తెలంగాణతో పంచుకున్నారు.

222

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles