ద్వాదశాదిత్య మహాగణపతి

Wed,June 26, 2019 01:12 AM

ఖైరతాబాద్ : ఆ రూపం చూస్తే సకల పాపాలు తొలగిపోతాయి...కోరిన భక్తులకు కొంగుబంగారమై...ఇంటికి ఇలవేల్పుగా విరాజిల్లుతూ భక్త జనకోటికి ఆరాధ్యదైవంగా నిలిచిన ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది ఓ అద్భుత రూ పంలో దర్శనమివ్వనున్నారు. ఆరున్నర దశాబ్దాలుగా వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న గణపతి ఈ ఏడాది చరిత్రలోనే తొలిసారిగా మహా వీరాఠ్ స్వరూపంలో కనిపిస్తారు. ఇప్పటి వరకు అరవై అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన మహాదేవుడు ఈ సంవత్సరం అరవై ఒక్క అడుగుల మహాకాయంతో శ్రీ ద్వాదశాధిత్య మహాగణపతిగా భక్తులను సాక్షాత్కరించనున్నాడు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం స్వామి వారి నమూనా చిత్రాన్ని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగారి సుదర్శన్, శిల్పి రాజేంద్రన్‌లు ఆవిష్కరించారు.

పన్నెండు ముఖాలు...24 చేతులు
ఖైరతాబాద్ చరిత్రలోనే అత్యంత ఎత్తులో ఈ ఏడాది గణేశుడిని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటి వరకు 60 అడుగుల ఎత్తులో గణపతి ప్రతిమను ఏర్పాటు చేసిన ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఈ ఏడాది రికార్డు స్తాయిలో 61 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో రూపొందిస్తున్నారు. శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో కళాకారులు ఈ మహారూపాన్ని తయారు చేస్తున్నారు. శ్రీ ద్వాదశాధిత్య మహాగణపతికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఏడు గుర్రాలతో సూర్య భగవానుని రథం ముందు నిండైన రూపంతో నేత్రానందం కలిగిస్తారు. కలశాన్ని దరించిన పది అడుగుల తొండం, 6అడుగుల ముఖంతో పాటు దానికి ఆనుకొని 12 ముఖాలు (మూడుఅడుగులు), గణపతి ప్రతిమ పైభాగాన 12 పడగల ఆదిశేషుడీ నీడలో చిన్ని గణపతి రూపం ఆకర్షణీయంగా ఉంటుంది. ఆంకుశం, పాశం తదితర పన్నెండు ఆయుధాలో కూడిన 12 అడుగుల 24 చేతులు, 22 అడుగుల కాళ్లు, ప్రధానమైన ఎడమ చేతిలో లడ్డు ప్రసాదం, కుడి చేతితో ఆశీర్వదిస్తూ కనిపిస్తారు. పాదాల వద్ద లడ్డుతో స్వామి వారి వాహనం ముషికం, గణేశుడి కుడివైపు మహాంకాళి, లక్ష్మీ, సరస్వతి అంశంగా పిలిచే సిద్ధకుంజికా దేవి, ఎడమవైపు గోవుతో నిలబడిన రూపంలో దత్తాత్రేయ స్వామి దర్శనమిస్తారు.

మహా విష్ణువు....ఏకాదశి దేవి
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మహాగణపతితో పాటు ప్రత్యేకతలో కూడిన ఇరవై అడుగుల రెండు మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ ద్వాదశాధిత్య మహాగణపతికి కుడి వైపు 12 అడుగుల ఎత్తులో ఆదిశేషుడి నీడలో ఆశీనులైన శ్రీ మహా విష్ణును నమస్కరిస్తున్న తీరులో పెద్దపులిపై ఏకాదశి దేవి, ఎడమ వైపు 20 అడుగుల ఎత్తులో శ్రీ దుర్గా అమ్మవారి పాదల వద్ద పద్మంపై త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడి ప్రతిమలు కనువిందు చేస్తాయి. ఈ సారి ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుంటే గణపతితో పాటు సూర్యానుగ్రహం కలుగుతుంది. సూర్యూడికి పన్నెండు రూపాలు ఉన్నాయి. అధిత్యుడి కిరణాలు పన్నెండు రకాలుగా మనపై ప్రసరిస్తాయి. ఆ కిరణాలను ఆధారంగా చేసుకొని రుషి మునులు పన్నెండు పేర్లతో సూర్యుడిని కొలిచారు. దాని ఆధారంగానే 12 మాసాలు ఏర్పడ్డాయి. అందుకే స్వామి వారిని ద్వాదాశాధిత్యుడిగా పిలుస్తారు. ఆయన అనుగ్రహం పొందాలంటే సకల దేవతలు ముందుగా కొలిచే గణపతి దేవుడి ఆశీస్సులను పొందాలి. అందుకే సూర్య రథ చక్రం ముందు నిలబడి ఉన్న గణపతిని రూపొందిస్తున్నారు. ఇంత ప్రాముఖ్యత కలి గిన మహాదేవుడిని ప్రతిష్ఠిస్తే ఆ ఏడాది మొత్తం అతి వృష్టి, అనావృష్టి తొలగిపోయి, లోకం, దేశం, రాష్ట్రం సుభీక్షంగా ఉంటుందని చెబుతున్నారు.

206

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles