మూసీ వెంట ఆరులేన్ల రహదారి

Wed,June 26, 2019 01:07 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మూసీ వెంట ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి హెచ్‌ఎండీఏ చర్యలను వేగవంతం చేసింది. ఉప్పల్ రింగ్ రోడ్డుపై పడుతున్న ట్రాఫిక్ ఒత్తిడిని శాశ్వతంగా తగ్గించడం, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి నాగోల్ వైపు సాఫీగా ప్రయాణం సాగించే ఉద్దేశ్యంతో రేడియల్ రోడ్ నం. 20 పనులను హెచ్‌ఎండీఏ అధికారులు తెరపైకి తీసుకువచ్చారు. నాగోల్ బ్రిడ్జీ నుంచి ప్రతాప సింగారం, గౌరెల్లి గ్రామ భూముల మీదుగా కొర్రెముల వరకు 15.50 కిలోమీటర్ల మేర (రేడియల్ రోడ్ నం. 20) పనులను సంబంధించి డిటెల్ట్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) రూపకల్పన బాధ్యతలను దాదాపు రూ. కోటితో స్టూప్ కన్సల్టెన్సీకి అప్పగించారు. ఈ మేరకు గడిచిన ఆరు నెలలుగా స్ట్రూప్ కన్సల్టెన్సీ క్షేత్రస్థాయిలో ఈ ఆరు లేన్ల నిర్మాణ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించి డీపీఆర్ సిద్ధం చేశారు. భూ సేకరణ మినహా ప్రాజెక్టు నిర్మాణ పనులకు గానూ దాదాపు రూ. 370 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనాతో డీపీఆర్‌ను సదరు ఎజెన్సీ హెచ్‌ఎండీఏకు సమర్పించారు. అయితే ఈ ప్రాజెక్టును జైకా నిధులతో హెచ్‌ఎండీఏ చేపట్టాలని భావించినా ఇందుకు జైకా నుంచి అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలోనే డీపీఆర్‌తో పాటు నిధుల అంశంపై స్పష్టత కోసం హెచ్‌ఎండీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రాజెక్టుకు నిధుల అంశంపై స్పష్టత తీసుకువచ్చి కార్యరూపంలోకి తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వరంగల్ రహదారి ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ రింగు రోడ్డుకు చేరకుండా ఎల్బీనగర్ వైపు చేరుకునే వారికి ఈ రహదారి ఎంతగానో దోహదపడనుంది.

270

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles