ప్రమాదకర సెల్లార్ల పూడ్చివేత

Wed,June 26, 2019 01:06 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రమాదకరంగా ఉన్న సెల్లార్ గోతులను బల్దియా ఆధ్వర్యంలో డెబ్రిస్ ద్వారా పూడ్చివేస్తున్నారు. సమీపంలో ఉండేవారు బల్దియాకు సమాచారమిస్తే వెంటనే వారు పూడ్చివేత చర్యలు చేపడతారు. అంతేకాదు, కొత్తగా సెల్లార్ తవ్వకాలను సెప్టెంబర్ 30వ తేదీ వరకు అనుమతించరాదని నిర్ణయించారు. ఒకవేళ నిర్మాణం పనులు జరిగే ప్రాంతంలో ఉన్న సెల్లార్ గోతుల వద్ద తగిన జాగ్రత్త చర్యలు పాటించేవిధంగా చర్యలు తీసుకోవాలని నిశ్చయించారు. నగరంలో పలు ప్రాంతాల్లో సెల్లార్ గోతులు తవ్వి అలాగే వదిలివేసినట్లు అధికారులు గుర్తించారు. వర్షాలకు అవి నీటితో మునికి ప్రమాదాలు సంభవించే వీలుంది. గతంలో అనేక ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో కొంతకాలంగా జీహెచ్‌ఎంసీ వర్షాకాలంలో సెల్లార్ తవ్వకాలపై నిషేధం విధిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా వచ్చే సెప్టెంబర్ చివరివరకు సెల్లార్ తవ్వకాలను అనుమతించరాదని నిర్ణయించారు. అంతేకాదు, గతంలో తవ్వి వదిలేసిన సెల్లార్లను డెబ్రిస్‌తో పూడ్చివేయాలని నిర్ణయించారు. యూసుఫ్‌గూడలోని వెంకటగిరి హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం వద్దగల పాత సెల్లార్‌ను మంగళవారం జీహెచ్‌ఎంసీ సిబ్బంది డెబ్రిస్‌తో పూడ్చివేశారు. అలాగే, అనుమతులు పొంది నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లోని సెల్లార్ల వద్ద తగు జాగ్రత్తలు పాటించే విధంగా నిర్మాణదారులకు నోటీసులు జారీచేశారు. సెల్లార్‌ల చుట్టూ ఎటువంటి బరువైన సామగ్రిని పెట్టరాదని, సెల్లార్ చుట్టూ మట్టికూలకుండా ఇసుకబస్తాలు ఏర్పాటుచేయాలని సూచిస్తున్నారు.

122

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles