ప్రాథమిక దశలోనే బొల్లి మచ్చల నివారణ

Wed,June 26, 2019 01:06 AM

-ఐఏడీవీఎల్ రాష్ట్ర అధ్యక్షుడుడాక్టర్ నర్సింహారావు నేత
-ప్రపంచ బొల్లి మచ్చల నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ, సదస్సు
బన్సీలాల్‌పేట్, జూన్ 25: ప్రాథమిక దశలో గుర్తిస్తే బొల్లిమచ్చలను నివారించవచ్చని సికింద్రాబాద్ గాంధీ దవాఖాన డిప్యూటీ సూపరింటెండెంట్, ఐఏడీవీయల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నర్సింహారావు నేత అన్నారు. అంతర్జాతీయ బొల్లి నివారణ దినోత్సవాన్ని (వెటిలిగో డే)పురస్కరించుకుని గాంధీ దవాఖాన చర్మ, లైంగిక వ్యాధుల విభాగం మెడికల్ కళాశాల, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజీ, వెనిరాలజీ, లెప్రసీ (ఐఏడీవీయల్) తెలంగాణ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గాంధీ దవాఖాన ఓపీ విభాగంలో పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహారావు మాట్లాడుతూ...బొల్లిమచ్చలు నివారణకు అవకాశమున్న ఒక సాధారణ చర్మ వ్యాధి మాత్రమేనన్నారు. బొల్లి మచ్చలు వం శపారంపర్యంగా రావని మానసిక, శారీరక, వైవాహిక జీవితానికి ఎటువంటి ఆటంకం కలగదన్నారు. ప్రాథమిక స్థాయి లో గుర్తించి వైద్యం అందిస్తే పూర్తిస్థాయిలో నయ మవుతుందన్నారు. గాంధీ దవాఖాన ఓపీ విభాగం లో ప్రతి శుక్రవారం ఉద యం 9 నుంచి 12 వర కు బొల్లి మచ్చలపై వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా దవాఖానలో ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి, బొల్లి మచ్చలపై అవగాహన కల్పించారు. అనంతరం డీవీఎల్ విభాగం సెమినార్ హాలులో కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో భాగం గా వైద్య విద్యార్థుల కోసం బొల్లిమ చ్చలపై అవగాహన, ఆధునిక చికి త్సాపద్ధ్దతులు, నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రతలపై అవగాహన కల్పించారు. కార్యక్రమం లో డీవీఎల్ విభాగం వైద్యులు టీ.రాజీవ్‌సింగ్, కటకం భూమేష్‌కుమార్, బీ.మోహన్‌లాల్, పద్మ, సహన, కవిత, సుధావాణి, సత్యశ్రీతోపాటు వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

110

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles