తెలంగాణతో కళకు మెరుగులు దిద్దుకునే అవకాశం

Wed,June 26, 2019 01:05 AM

సిటీబ్యూరో/రవీంద్రభారతి, నమస్తే తెలంగాణ : తెలంగాణ బుర్రకథ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభమైన బుర్రకథల పోటీలు మంగళవారం కూడా కొనసాగాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన బుర్రకథ కళాకారులు వారి వారి ప్రత్యేక కథలతో పోటీల్లో ఒకరిని మించి మరొకరు ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొంటున్నారు. రెండో రోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా బుర్రకథ కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి రాజుల శంకర్, ప్రధాన కార్యదర్శి సాలం కృష్ణయ్య విచ్చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ మన రాష్ట్రం సిద్ధించాక ప్రతి కళాకారుడికి తనలోని కళకు కాస్త మెరుగులు దిద్దుకునే అవకాశం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఎందరెందరో కళాకారులను తీర్చిదిద్దుతున్నదన్నారు. అందులో భాగంగా నేడు 39 బుర్రకథ బృందాలకు పోటీలను సైతం నగరం నడిబొడ్డున నిర్వహించుకుంటున్నామని అన్నారు. ప్రధాన కార్యదర్శి సాలం కృష్ణయ్య మాట్లాడుతూ కళాకారుల తీరు తెన్నులపై ప్రభుత్వం ఒక దిక్సూచిలా భాషా సాంస్కృతిక శాఖను ఏర్పాటు చేసి మాలాంటి కళాకారులకు ఒక పెద్ద దిక్కుగా చేశారన్నారు. కాగా, మంగళవారం 14 బుర్రకథ బృందాలకు పోటీలు జరిగాయి. ఇందుకు ఎస్కే బాపూజీ, వూసల రజనీ గంగాధర్, కూచిపూడి వెంకటేశ్వర్లు బుర్రకథ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ ననుమాస స్వామి పోటీలను వీక్షించేందుకు ప్రత్యేకంగా విచ్చేశారు. ఇప్పటి వరకు సోమ, మంగళవారాలు కలుపుకొని 27 బృందాలకు గాను బుర్రకథ పోటీలు జరిగాయి.

80

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles