28న తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు

Wed,June 26, 2019 01:04 AM

-హాజరుకానున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : తెలుగు విశ్వవిద్యాలయం అందజేసే సాహితీ పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఈనెల 28న వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో నిర్వహిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య అలేఖ్య పుంజాల ఒక ప్రకటనలో తెలిపారు. 2017 సంవత్సరానికి తెలుగు సాహిత్యంలోని పలు విభాగాల్లో ఉత్తమ గ్రంథాల రచయితలకు రూ.20,116 నగదుతోపాటు సాహితీ పురస్కారాన్ని అందజేసి సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు వివరించారు. ఇదిలా ఉండగా మన్య భారతం పద్య కవితకు చింతూరి మల్లయ్య, వానొస్తదా? వచన కవితకు నారాయణస్వామి, ఎలకోయిలపాట గేయకవితకు తుమ్మూరి రామ్మోహన్‌రావు, అనగ అనగా పిల్లల కథలు బాలసాహిత్యానికి కొల్లూరు స్వరాజ్యంవెంకటరమణమ్మ, నెమలినార కథకు బి.మురళీధర్, మొగలి నవలకు భూతం ముత్యాలు, శైలీశిల్పం వేయేళ్ల తెలుగు కవిత్వం సాహిత్య విమర్శ గ్రంథానికి డాక్టర్ అట్లా వెంకటరామిరెడ్డి, సప్తసౌరభాలు నాటక గ్రంథానికి భారతుల రామకృష్ణ, గుప్పిటజారే ఇసుక అనువాద గ్రంథానికి మెహక్ హైదరాబాదీ, దేవరహస్యం వచన రచనకు కోవెల సంతోశ్‌కుమార్, రామక్కమాన్యం రచయిత్రి ఉత్తమ గ్రంథానికి జూపాక సుభద్రకు అందజేయనున్నట్లు రిజిస్ట్రార్ అలేఖ్య పుంజాల వివరించారు.

78

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles