యోగాతో ఆరోగ్యం మంత్రి ఈటల రాజేందర్

Thu,June 20, 2019 12:35 AM

చార్మినార్ : యోగాతో అందరికీ ఆరోగ్యం అందుతుందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం ఆయూష్ ఆధ్వర్యంలో పాతనగరంలోని చారిత్రక చార్మినార్ కట్టడం వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమం తప్పకుండా యోగాసనాలు నిర్వహిస్తున్న క్రమంలో దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. అనాధిగా మన సంస్కృతిలో భాగంగా ఉన్న యోగా నేడు విశ్వవ్యాప్తం అయ్యిందన్నారు. ప్రతిరోజు యోగాసనాలు వేయడం ద్వారా ఒత్తిళ్లను సైతం దూరం చేసుకోవచ్చన్నారు. యోగా ద్వారా అందరికీ ఆరోగ్యం సమకూరుతుందన్నారు. క్రమం తప్పకుండా ప్రతిఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం యునానీ కాలేజీ ప్రిన్సిపాల్ సుల్తానా మాట్లాడుతూ ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు యోగాతో కలిగే ఉపయోగాలను తెలియజేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆయుష్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ అలుగు వర్షిని ఆదేశాలతో యోగా కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. యునానీ కాలేజీకి చెందిన సుమారు 1500 మంది విద్యార్థులతోపాటు పత్తర్‌ఘట్టి కార్పొరేటర్ సోహెల్ ఖాద్రీతోపాటు యునానీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డా.ఎండీ సిరాజుద్దీన్, యునానీ దవాఖాన సూపరింటెండెంట్ వకీల్ సలీం, ఎంఏ ఫరూఖ్ పాల్గొన్నారు.

241

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles