హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌లో ఖాళీలెన్నో..

Mon,June 17, 2019 03:42 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నిరవధికకంగా కొనసాగుతున్న పదవీ విరమణలు..భర్తీ కానీ ఖాళీలు వెరసి హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్లానింగ్ విభాగం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. దశబ్దాలకు పైబడి కొత్త నియామకాలు లేకపోవడం...7, 257 స్కేర్ కిలోమీటర్ల మేర సంస్థ పరిధి పెరుగడంతో ఉద్యోగులకు విధి నిర్వహణ కత్తిమీద సాములా మారింది. నిర్మాణ రంగ అనుమతులు, క్షేత్రస్థాయి పర్యటనలు, కోర్టు కేసులు, అక్రమ నిర్మాణాల గుర్తింపు, ఏరివేత, కొత్త పాలసీల రూపకల్పన ఇలా తలకు మించిన భారం మారుతున్నదని ఉద్యోగులు వాపోతున్నారు. ఒక్కో అధికారికి రెండేసి బాధ్యతలు ఉండడంతో పౌర సేవలకు విఘాతం ఏర్పడుతున్నది. డైరెక్టర్ మొదలు జేపీవో వరకు అదనపు బాధ్యతలతో సతమతమవుతున్నారు. ఈ నెలాఖరులోనూ కీలక స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ప్రతిపాదిత నూతన జోన్ల ఏర్పాటును ప్రధానంగా పరిగణనలోకి తీసుకొని 55 పోస్టుల భర్తీ ప్రతిపాదనలను పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్ పరిశీలించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

244

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles