భాగ్యరెడ్డివర్మ ఆశయాలను విద్యార్థులు ఆచరించాలి : ప్రొఫెసర్ లింబాద్రి

Thu,May 23, 2019 12:10 AM

ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ వైతాళికుడు, దళిత ఉద్యమ ధృవతార మాదరి భాగ్యరెడ్డి వర్మ ఆశయాలను విద్యార్థులు ఆచరించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి సూచించారు. విద్యార్థులతోపాటు యువత, మేధావులు ఆయన ఆలోచనలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భాగ్యరెడ్డి వర్మ 131వ జయంతిని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీలో ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్(అంసా) బుధవారం స్మారక ఉపన్యాస కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఓయూ మెయిన్ లైబ్రరీ బిల్డింగ్‌లోని ఐసీఎస్‌ఎస్‌ఆర్ సెమినార్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వక్తగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1906లోనే భాగ్యరెడ్డివర్మ 18 ఏళ్ల వయసులో దళిత ఉద్యమాలకు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. తెలుగు నేలపై దళిత, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాలకు మొట్టమొదటి పునాది వేశారని కొనియాడారు. ఇటీవల పదవీ విరమణ పొందిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ మల్లేశానికి ఈ సందర్భంగా ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్ ట్రస్టీ జ్ఞానప్రకాశ్, టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్యాంసుందర్, ఓయూ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ నవీన్‌కుమార్, సమాంతర ఎడిటర్ వరుణ్‌కుమార్, డాక్టర్ కరుణ రుపుల, జి.శంకర్, లైబ్రేరియన్ పవన్‌కుమార్, అంసా వ్యవస్థాపకుడు మాందాల భాస్కర్, నాయకులు లింగస్వామి, అరుణ్, సురేశ్, నరేశ్, సూర్యం, నందకిశోర్, శంకర్, రవీందర్, రవి, మురళి తదితరులు పాల్గొన్నారు.

141

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles