అతివేగం... ప్రాణాలు తీసింది

Thu,May 23, 2019 12:09 AM

ఘట్‌కేసర్ : కారు అతివేగానికి ఇంజినీరింగ్ విద్యార్థి బలైయ్యాడు. ఫైనలీయర్ పరీక్ష రాయడానికి వెళ్తుండగా అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వరంగల్ జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకున్నది. సీఐ రఘువీర్‌రెడ్డి కథనం ప్రకారం... కీసర మండలం, రాంపల్లికి చెందిన గుండెగోని కృష్ణ కొడుకు జి. పృథ్వీరాజ్ ( 21 ) చీర్యాల్ గ్రామంలోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలీయర్ చదువుతున్నాడు. బుధవారం పరీక్ష రాయడానికి ఘట్‌కేసర్ మండలం అవుశాపూర్‌లోని వీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాలకు స్కూటీ ( ఏపీ 29సీసీ 2047 ) పై వెళ్తున్నాడు. ఎదులాబాద్ గ్రామ అండర్ బ్రిడ్జిపైకి వెళ్లగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ( ఏపీ 11 ఎటీ 7389 ) స్కూటీని ఢీ కొట్టింది. దీంతో పృథ్వీరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్కూటీని కారు కొద్ది దూరం లాక్కెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

107

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles