రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి

Thu,May 16, 2019 12:31 AM

బేగంబజార్‌: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. బుధవారం గోషామహల్‌ ట్రాఫిక్‌ ట్రేనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ సెంటర్‌లో నగర ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌ సేఫ్టీ సమ్మర్‌ క్యాంపును సీపీ అంజనీకుమార్‌ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే రోడ్డు భద్రతలో హైదరాబాద్‌ నగరం నంబర్‌వన్‌లో ఉందన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న చందంగా చిన్నతనం నుంచే విద్యార్థులకు రోడ్డు భధ్రతపై అవగాహన కల్పించడమే ఈ సమ్మర్‌ క్యాంపు లక్ష్యమన్నారు. ఈ ట్రాఫిక్‌ ట్రేనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో ఏడాదికి హోండాకు చెందిన నిపుణులు సుమారు 4వేల మందికి ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పిస్తామన్నారు. సమ్మర్‌ క్యాంపులో భాగంగా తొలి విడుతలో 11 నుంచి 15 ఏండ్ల సుమారు 200 మంది చిన్నారులకు ట్రాఫిక్‌ నియమ నిబంధనలపై, రోడ్డు భధ్రత, హెల్మెట్‌, సీటు బెల్ట్‌ వాడకం వంటి అంశాలపై ట్రాఫిక్‌ సీనియర్‌ అధికారులు శిక్షణ ఇస్తారని సీపీ పేర్కొన్నారు. కొత్తతరానికి ట్రాఫిక్‌ విధానాలపై అవగాహన కల్పించేందుకు ఈ సమ్మర్‌ క్యాంపు ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను పూర్థి స్థాయిలో అరికట్టవచ్చన్నారు. ప్రతి సంవత్సరం ట్రాఫిక్‌ నిబంధనలపై మూడు నుంచి నాలుగు వేల మంది విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు పోలీస్‌ కమిషనర్‌ట్రాఫిక్‌ అనిల్‌కుమార్‌, డీసీపీలు చౌహాన్‌, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

141

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles