ఈ సారి.. కోటి మొక్కలు

Wed,May 15, 2019 12:53 AM

-గ్రేటర్‌లో హరితహారం లక్ష్యం
-నర్సరీల్లో మొక్కల పెంపకం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఈ ఏడాది హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రేటర్‌ పరిధిలో ఒక కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ తెలిపారు. ఇందుకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీ నర్సరీల ద్వారా 60లక్షలు, ప్రైవేటు నర్సరీల ద్వారా మిగిలిన 40లక్షల మొక్కలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం వివిధ అంశాలపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాలనీ సంఘాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా, జీహెచ్‌ఎంసీకి చెందిన పార్కులు, ఖాళీజాగాలతోపాటు స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీస్థలాలను గుర్తించి వాటిలో విస్తృతంగా మొక్కలు నాటాలన్నారు. అంతేకాకుండా కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ కింద ట్రీగార్డ్‌లను సేకరించాలని జోనల్‌ కమిషనర్లను కోరారు. పార్కుల్లో క్రీడా పరికరాల నిర్వహణ బాధ్యతను క్రీడా విభాగం నుంచి అర్భన్‌ బయోడైవర్శిటీ విభాగానికి అప్పగిస్తున్నట్లు కమిషనర్‌ చెప్పారు. అలాగే, రంజాన్‌ పండుగ సందర్భంగా విందు ఏర్పాటుతోపాటు బహుమతుల పంపిణీకి ఒక్కో వార్డులో రెండు చొప్పున మసిదులను గుర్తించాలని అధికారులను కోరారు.

325

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles