ఈ -వ్యర్థం.. తెచ్చేను అనర్థం

Fri,April 26, 2019 12:18 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఐటీ రాజధానిగా వెలుగొందుతున్న హైదరాబాద్‌లో ఈ -వ్యర్థాలు భారీగా పోగవుతున్నాయి. కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. నగరాన్ని మొత్తంగా కాలుష్య కూపంగా మార్చేస్తున్నాయి. 2016-17 సంవత్సరానికి 28,749 మెట్రిక్ టన్నులు వ్యర్థాలుగా మారినట్లు అధ్యయనంలో తేలింది. 2014-15లో 3,739 మెట్రిక్ టన్నులుగా ఉన్న వ్యర్థాలు ఒకే ఏడాదిలో 28 వేలకు చేరడం ఆందోళనకరం. ఇక రానున్న రోజుల్లో వ్యర్థాల మరింతగా పోగవుతాయని, 2021-22 సంవత్సరానికి 50,335 టన్నులకు చేరుకునే ప్రమాదముందని అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది.

హైదరాబాద్‌తో సహా..
హైదరాబాద్ సహా తెలంగాణలోని ఆరు మున్సిపల్ కార్పొరేషనలో ఈ -వ్యర్థాల తీరుతెన్నులపై నగరంలోని ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఈపీటీఆర్‌ఐ) అధ్యయనం చేసింది. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సూచనల మేరకు ఈపీటీఆర్‌ఐ హెచ్‌ఎండీఏ పరిధిలో ఈ -వ్యర్థాలపై అధ్యయనం చేసి ఆయా నివేదికను పీసీబీకి సమర్పించింది.

- హెచ్‌ఎండీఏ పరిధిలో ఈ వ్యర్థాల వినియోగం అత్యధికంగా ఉంది. ఒక వ్యక్తి ఏడాదికి 2.09 ఈ- వ్యర్థాలను పోగుచేస్తున్నట్లు అధ్యయనంలో తేలింది.
- మన దేశంలో సగటున ఒక వ్యక్తి 1.5 కిలోల ఈ -వ్యర్థాలను పోగు చేస్తుండగా, గ్రేటర్ పరిధిలో జాతీయ సగటు కంటే అధికంగా వినియోగం ఉండడం ఆందోళనకరం.
- అయితే అభివృద్ధి చెందిన దేశాలు మన కంటే అత్యధికంగా ఈ -వ్యర్థాలను పోగు చేస్తున్నాయి. చైనాలో, 5.2, అమెరికాలో 19.4, జపాన్‌లో 16.9, సింగపూర్‌లో 17.9, యూరప్‌లో 28. 5, ఆఫ్రికాలో 5.7 కిలోల చొప్పున సగటున ఈ -వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నారు.
- హెచ్‌ఎండీఏ పరిధిలో వెలువడుతున్న ఈ- వ్యర్థాల్లో 70 శాతం గృహోపకరణాల నుంచి వెలువడుతుండగా, 30 శాతం బల్క్ కస్టమర్ల నుంచి వెలువడుతున్నది.
- ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అధికంగా వెలువడగా, పదేండ్ల కాలం నుంచి ప్రైవేట్ సంస్థల నుంచి అధికమవుతున్నది. 2009లో 75 శాతం ప్రభుత్వ రంగం సంస్థల నుంచి ఉంటే, తాజాగా 70 శాతం విద్యా, బ్యాంకింగ్, హెల్త్ సెక్టార్ సంస్థల నుంచి అధికంగా పోగవుతున్నది.

అనర్థాలే అధికం..
ఈ -వ్యర్థాల నిర్వహణపై అవగాహన లేక పక్కదారిపడుతున్నాయి. అసంఘటిత రంగంలోనే సేకరణ కొనసాగుతున్నది. ర్యాగ్‌పిక్కర్లు.. చెత్తసేకరణ కార్మికులు ఈ- వ్యర్థాల్లో నుంచి బంగారం దొరుకుతుండడంతో భస్మం చేస్తున్నారు. కంప్యూటర్ సీపీయూ మధర్‌బోర్డులు, సెల్‌ఫోన్లలో సిలికాన్ చిప్పుల్లో బంగారం లభిస్తున్నది. అశాస్త్రీయంగా కాల్చివేస్తుండడంతో వీటి నుంచి కాలుష్యం వెలువడుతున్నది. వ్యర్థాల నిర్వహణ.. యాజమాన్య పద్ధతుల్లో లోపాలతో విషాన్ని వెల్లగక్కుతున్నది. తెలియకుండా కాల్చిన పాపానికి కాన్సర్‌ను మోసుకొస్తున్నది. దేశవ్యాప్తంగా ఈ -వేస్ట్‌ను ఉత్పత్తి చేస్తున్న నగరాల్లో మన హైదరాబాద్ టాప్-5 నగరాల్లో ఉన్నట్లు వెల్లడయింది.

కాల్చి వేస్తే.. క్యాన్సర్..
ఎలక్ట్రానిక్ వేస్ట్ కాలుష్యాన్ని వెదజల్లుతున్నది. వ్యర్థాల కాల్చివేత శ్వాసకోస వ్యాధులు, క్యాన్సర్‌ను మోసుకొస్తున్నాయి. ఈ -వ్యర్థాలను కాల్చడం వల్ల క్రోమియం, కాడ్మి యం వాయువులు వెలువడుతున్నాయి. ఈ వాయువులను పీల్చుకుంటే కాన్సర్ తిత్తులు తయారవ్వడం ఖాయం. సాధారణంగా కాన్సర్ వ్యాధి ప్రారంభ దశలో ఉన్నవారిలో రెండున్నర సంవత్సరాలకు వ్యాధి లక్షణాలు బయటపడితే, ఈ వాయువులు పీల్చుకున్న వారిలో వ్యాధి సంవత్సరానికే ముదురిపోవడం ఖాయమని నిపుణులంటున్నారు. వ్యర్థాల నిర్వహణ కంపెనీలకు ఇది భారం కావడం, ధనం వెచ్చించాల్సి రావడంతో దీనిని పట్టించుకోవడం లేదు.

పాతినా ప్రమాదమే.
వ్యర్థాలను కాల్చడమే కాదు.. భూమిలో పాతినా అనర్థమే. వాటిని పాతడం వల్ల కాలుష్యకారకాలు భూమిలో కలిసిపోయి భూసారాన్ని దెబ్బ తీస్తున్నాయి. ఆహారపు గొలుసును హరిస్తున్నాయి. ఈ- వేస్ట్ నుంచి 21 శాతం ప్లాస్టిక్, 13 శాతం ఫెర్రస్, 16 శాతం నాన్ ఫెర్రస్ మెటల్స్ వెలువడుతున్నాయి. కాపర్, అల్యూమినియం, అర్సెనిక్, కాడ్మియం, సెలోనియం, క్రోమియం తదితరాలు గాల్లో కలుస్తున్నాయి.

206

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles