ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం

Wed,April 24, 2019 12:33 AM

బేగంపేట ఏప్రిల్ 23: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని సనత్‌నగర్ ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. మంగళవారం మారేడ్‌పల్లిలోని తన నివాసంలో సనత్‌నగర్ నియోజకవర్గం కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. నియోజకవర్గం పరిధిలోని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి శని, ఆదివారాల్లో బస్తీలు, కాలనీల్లో పర్యటించనున్నట్టు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు వారి వారి బస్తీలు, కాలనీల్లో సమస్యలను గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ శనివారం ఉదయం అమీర్‌పేట డివిజన్, ఆదివారం బేగంపేట డివిజన్లలో పర్యటించనున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలో కొన్ని పనులు అసంపూర్తిగా ఉన్నాయని, మరికొన్ని అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదని చెప్పారు. వాటిపై ఎన్నికల కోడ్ ముగిసిన అనంతనం సమీక్ష చేయనున్నట్టు వివరించారు. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు అరుణగౌడ్, ఉప్పల తరుణి, ఆకుల రూప, హేమలతా, శేషుకుమారి, నాయకులు కూన వెంకటేశ్‌గౌడ్ పాల్గొన్నారు.

207

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles