సిధారెడ్డిది ప్రజల కవిత్వం

Mon,April 15, 2019 01:03 AM

- సరస్వతి సమ్మాన్ స్వీకర్త, కేంద్ర సాహిత్య అకాడమీ
తెలుగు సలహామండలి అధ్యక్షుడు కె.శివారెడ్డి
నమస్తే తెలంగాణ, సిటీబ్యూరో/ బషీర్‌బాగ్ : తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డిది ప్రజల కవిత్వమని సరస్వతి సమ్మాన్ స్వీకర్త, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి అధ్యక్షుడు కె.శివారెడ్డి అన్నారు. నందిని సిధారెడ్డి కవిత్వం నీటి మనసుతో తెరసం ఆధ్వర్యంలో కవితా పఠనం - ఆవిష్కరణ సమావేశం ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సరస్వతి సమ్మాన్ స్వీకర్త, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి అధ్యక్షుడు కె.శివారెడ్డి మాట్లాడారు. గత 40 ఏండ్లుగా ప్రజలతో మమేకమై కవిత్వం రాస్తున్న కవి నందిని సిధారెడ్డి కొనసాగింపు కవిత్వమే నీటి మనసు అని అన్నారు. సిధారెడ్డి తనకు చిరకాల మిత్రుడని, ఆయన నా నుంచి పొందేదేమిటో తెలియదు కాని, ఆయన నుంచి తాను స్వీకరించిందే ఎక్కువన్నారు. కార్యక్రమంలో తొలుత సిధారెడ్డి తన కవితా నేపథ్యం చెబుతూ కవిత్వాన్ని పఠించారు.

నాకు నా కలలే, నీటి మనసు, ఊరి నెత్తురు, నిజయాత్ర, నా కలలు నావి అనే ఐదు కవితలను చదివి వినిపించారు. ప్రసిద్ధ విమర్శకులు థింసా నీటి మనసు సంపుటిని విశ్లేషించారు. సిధారెడ్డి తన ప్రయాణపు మలుపులన్నింటిలో నిబద్ధతతో కవిత్వం రాశారన్నారు. తను అనుభవించినది, పలవరించినది మాత్రమే రాశారని, తను ఏ స్థానంలో ఉన్నా తన మనసు శ్రమ జీవులతో మమేకమయ్యే కవిత్వమే రాశారని తెలిపారు. ప్రతి కవిత తన అంతరంగపు లోతుల నుంచి వచ్చిందని థింసా విశ్లేషించారు. అనంతరం, కందుకూరి శ్రీరాములు, డాక్టర్ వి.శంకర్, డాక్టర్ కె.విద్యావతి, తైదల అంజయ్య, ఘనపురం దేవేందర్, పొన్నాల బాలయ్య నీటి మనసు సంపుటిలోని కవితలను చదివారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ నాళేశ్వరం శంకరం సిధారెడ్డి రచనల ప్రస్థానాన్ని వివరించారు. డాక్టర్ బెల్లంకొండ సంపత్‌కుమార్ పాల్గొన్నారు.

154

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles