కబళించిన మృత్యువు


Sat,March 23, 2019 03:03 AM

- వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి... ఒకరికి గాయాలు
- ప్రాజెక్టు పనుల కోసం వెళ్తుండగా .. ఢీకొన్న ఆర్టీసీ బస్సు
- ఇంజినీరింగ్ విద్యార్థిని దుర్మరణం... మరో విద్యార్థినికి గాయాలు
- ఉప్పల్‌లో ఘటన


ఉప్పల్, (నమస్తే తెలంగాణ) : ప్రాజెక్టు పనుల కోసం వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి చెందగా, మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యా యి. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకా రం... హోలీమేరి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థినులు స్నేహ, శృతి బీటెక్ ఫైనల్ చదువుతున్నారు. బోడుప్పల్‌లోని ఇంటి నుంచి ప్రాజెక్టు పనుల కోసం వా హనంపై అమీర్‌పేట మైత్రివనం వెళ్తున్నారు. ఉప్పల్‌లోని గాంధీ విగ్రహం వరకు చేరుకున్నారు. ఈ ప్రాంతం లో బస్టాప్ ఉండటం, రద్దీగా ఉండటంతో నెమ్మదిగా వె ళ్తున్నారు. అక్కడే చెంగిచెర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుకనుంచి వచ్చి ఢీకొట్టిం ది. దీంతో వాహనంపై నుం చి విద్యార్థినులు కింద పడిపోయారు. బస్సు కంట్రోలు తప్పి స్నేహ(21) పై నుంచి వెళ్లింది. దీంతో స్నేహ అక్కడికక్కడే మృతిచెందగా, మరో విద్యార్థినికి గా యాలయ్యా యి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కూలీకి వెళ్లి వస్తుండగా ఆటో ఢీకొని...
పేట్‌బషీరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై మహేశ్ కథనం ప్రకారం... గండిమైసమ్మదుండిగల్ మండలం, దూలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని యాదవబస్తీలో అగతమూడి తిరుపతిరావు(44), జయమ్మ దంపతులు నివాసముంటారు. కూలీ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. రోజు మాదిరిగానే తిరుపతిరావు శుక్రవారం కూలీ పనికి వెళ్లి తిరిగి వస్తుండగా... వేగంగా దూసుకువచ్చిన ఆటో ట్రాలీ(ఏపీ 05 టీబీ 8871) ఢీకొట్టింది. ఈప్రమాదంలో తిరుపతిరావు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.


డివైడర్‌ను ఢీకొని యువకుడు....
మేడిపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....ఉప్పల్ గాంధీనగర్ కాలనీకి చెందిన చెదల వెంకటేశ్వర్ల కుమారుడు క్రాంతి సాయి (25) కారు డ్రైవర్. కాగా... గురువారం రాత్రి బైక్‌పై ఉప్పల్ నుంచి బోడుప్పల్ వైపు వస్తుండగా ఉప్పల్ డిపో సమీపంలోని మహారాజ ఫంక్షన్ హాల్ వద్దకు రాగానే బైకు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన క్రాంతిని స్థానికులు 108లో గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్టీసీబస్సు ఢీకొని.. చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి...
సైదాబాద్, (నమస్తే తెలంగాణ): రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎస్‌ఐ దీన్‌దయాళ్ సింగ్ కథనం ప్రకారం.... ఈ నెల 14న సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టీఎస్31 జడ్ 0015 )ఎంజీబీఎస్ నుంచి అచ్చంపేటకు వెళ్తుంది. చంచల్‌గూడ జైలు చౌరస్తా సమీపంలోకి రాగానే రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో త్రీవంగా గాయపడ్డ అతన్ని స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు ఉస్మానియా దవాఖానకు తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. మృతుడిని ముస్లిం వ్యక్తిగా గుర్తించామని, ఆచూకీ తెలిసిన వారు సైదాబాద్ పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

511

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles