ఆర్‌బీఐ విధానాలతో ఆర్థిక వ్యవస్థ పురోగతి

Wed,March 20, 2019 12:17 AM

-ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు
కాచిగూడ,మార్చి 19: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుసరిస్తున్న ద్రవ్య విధానం వల్ల రాబోయే రోజుల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ అతి వేగంగా పురోగతి చెందుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. మార్వాడి శిక్షాసమితి, ఆర్.జి. కెడియా కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నాబార్డ్ వ్యవస్థాకుడు ఎం.రాయకృష్ణయ్య 4వ స్మారకోపాన్యాస కార్యక్రమం, నిత్య జీవితంలో ఆర్‌బిఐ పాత్ర అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దువ్వూరి సుబ్బారావు హాజరై మాట్లాడుతూ ఉత్పత్తి పెంచుకోవడం ద్వారానే దేశ ఆర్థిక వ్యవస్థ మరింతగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు దేశానికి అవసరమేనని, నల్లధనాన్ని నియంత్రించడానికి ఉపయోగ పడుతుందన్నారు.ప్రస్తుతం ఆర్‌బీఐ అనుసరిస్తున్న క్రమబద్ధీకరణ, పర్యవేక్షణ, విధులు, ఆర్థిక నేరాలను అరికట్టడం, ఉపయుక్తమైన నిర్ణయాలను తీసుకోవడానికి దోహదపడుతుందన్నారు. ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎస్‌హెచ్‌టీ మేనేజింగ్ ట్రస్టీ ప్రొఫెసర్ ప్రమోద్ షిండే, కార్యదర్శి సురేంద్రలూనియా, సహయ కార్యదర్శి ఎస్.బి కాబ్రా, ప్రొఫెసర్, డైరెక్టర్ డి.వి.జి.కృష్ణ, మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ రమేశ్ భంగ్, డాక్టర్ రమేశ్‌కుమార్, టీవీరావు పాల్గొన్నారు.

91

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles