15 సంవత్సరాలు దాటిన వాటర్ ట్యాంకర్లు జప్తు

Thu,March 14, 2019 11:55 PM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పదిహేను సంవత్సరాలు దాటిన వాటర్ ట్యాంకర్లను జప్తు చేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ అనిల్‌కుమార్ ఆదేశించారు. ప్రమాదాలకు కారణమవుతున్న వీటిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. ఇలాంటి వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి 15 ఏండ్లు దాటిన వాటిని జప్తుచేసి వాటిని ఆర్‌టీఏ అధికారులకు అప్పగించాలన్నారు. రద్దీ, అనుమతి లేని సమయంలో ప్రైవేటు బస్సులు సిటీలో తిరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. హారన్, సైలెన్స్‌ర్‌లతో శబ్ధ కాలుష్యాన్ని సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా డ్రంకన్ అండ్ డ్రైవింగ్ నిర్వహించే సమయంలో ప్రతి అధికారి కచ్చితంగా నిర్దేశించిన ప్రక్రియ(ఎస్‌ఓటీ-స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిడ్జర్)ను పాటించాలని అధికారులకు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జరిగే ర్యాలీలు, సభలు, సమావేశాలను దృష్టిలో పెట్టుకుని సాధారణ వాహనాదారులకు అంతరాయం, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. అదేవిధంగా పెండింగ్ కేసులపై సమీక్ష జరిపిన అదనపు సీపీ చార్జిషీట్‌ను దాఖలు చేసి పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించాలన్నారు. పలు అంశాలపై గురువారం ట్రాఫిక్ ప్రధాన కార్యాలయంలో ట్రాఫిక్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అనేక అంశాలపై చర్చించారు.

292

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles