ట్రిపుల్ ఐటీ..ఆవిష్కరణల్లో మేటి

Sun,February 24, 2019 12:11 AM

శేరిలింగంపల్లి : సాంకేతికతో అద్భుత ఆవిష్కరణలకు గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ వేదికైంది. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ షోకేస్-2019 ఆకట్టుకుంటున్నది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ వార్షిక పరిశోధనాభివృద్ధి ప్రదర్శన శనివారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్లోబల్ ఇన్నోవేషన్ ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ సత్యప్రకాశ్ హాజరయ్యారు. ట్రిపుల్ ఐటీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డీన్ ప్రొఫెసర్ వాసుదేవ వర్మ, అకాడమీ డీన్ ప్రొఫెసర్ జయంతి శివస్వామి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు తరలివచ్చారు. ప్రతి యేటా ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా నిర్వహించే ఈ వార్షిక పరిశోధనాభివృద్ధి ప్రదర్శన వారి ప్రతిభాపాటవాలకు, పరిశోధనలకు అద్దం పడుతుంది.

డేటా ఇంజినీరింగ్, ఐటీ ఫర్ అగ్రికల్చర్, విజువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఇన్ ఎడ్యుకేషన్, రోబోటిక్ రీసెర్చ్ సెంటర్, ఎర్త్‌కేక్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్, వర్చువల్ ల్యాబ్స్, నేచురల్ సైన్స్ అండ్ బయో ఫార్మాటిక్స్, లాంగ్వేజ్ టెక్నాలజీ రీసెర్స్ సెంటర్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మిషన్ ట్రాన్స్‌లేషన్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్, ఇంజినీరింగ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ తదితర విభాగాలకు చెందిన 290 పరిశోధన నమూనాలను ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్, ఐటీ సైన్స్ అండ్ టెక్నాలజీతోపాటు ఈ-సాగు నమూనాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రోడ్ ఆడిట్ సిస్టం పేరిట రూపొందించిన జీపీఎస్ సాఫ్ట్‌వేర్, పునరుత్పాదక ఇంధనంతో విద్యుత్ ఆదా చేసే పవర్‌ప్లాంట్, సామాజిక మాధ్యమాల్లో ఫొటో మార్ఫింగ్ చిత్రాలను గుర్తించే సాఫ్ట్‌వేర్ నమూనాలు ఆకట్టుకున్నాయి.

నాణ్యమైన నిర్మాణాలపై..
ట్రిపుల్ ఐటీ ఎర్త్‌కేక్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులు భూ కంపాల సమయంలో నిర్మాణాలు పటిష్టంగా ఉండి నష్టాన్ని తగ్గించే విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలను వివరించారు.
అటానమస్ డ్రోన్
ప్రకృతి విపత్తులు, భూకంపాలు, భారీ నిర్మాణాలు కూలినప్పుడు హెలికాప్టర్ మాదిరిగా నాలుగు చిన్నపాటి రెక్కలతో గాలిలో ఎగురుతూ అటానమస్ డ్రోన్ కెమెరాతో అక్కడి ఫొటోలను గుర్తించి చిత్రీకరిస్తుంది. వైఫైతో నడిచే ఈ పరికరం అనుకోకుండా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మనుషులు వెళ్లలేని చోటుకి సులువుగా చేరుకుంటుంది. దీన్ని రోబోటిక్స్ విభాగం విద్యార్థులు తయారు చేశారు.

313

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles