సంత్‌శ్రీ సేవాలాల్ సేవలు స్ఫూర్తిదాయకం

Sun,February 24, 2019 12:08 AM

-వర్సిటీ రిజిస్ట్రార్ యాదయ్య
కేపీహెచ్‌బీ కాలనీ : సంచార జీవులైన లంబాడీలను ఏకం చేసి అభివృద్ధి పథం వైపు నడిపించిన సంత్‌శ్రీ సేవాలాల్ సేవలు స్ఫూర్తిదాయకమని జేఎన్‌టీయూహెచ్ వర్సిటీ రిజిస్ట్రార్ ఎన్.యాదయ్య అన్నారు. శనివారం జేఎన్‌టీయూహెచ్ వర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్, బంజార విద్యార్థి సంయుక్తాధ్వర్యంలో యూజీసీ ఆడిటోరియంలో సంత్‌శ్రీ సేవాలాల్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సంత్‌శ్రీ సేవాలాల్ చిత్రపటానికి వర్సిటీ రిజిస్ట్రార్ ఎన్.యాదయ్య, ప్రిన్సిపాల్ ఇ.సాయిబాబారెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ ఆఫీసర్ బలరాం నాయక్, సుల్తాన్‌పూర్ ప్రిన్సిపాల్ బాలునాయక్, అమర్‌సింగ్ లీలావత్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన జాతులను ఏకం చేసిన మహానీయుడని కొనియాడారు. అనంతరం సేవాలల్ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. వర్సిటీ అధ్యాపకులు రమణానాయక్, రూప్‌సింగ్ నాయక్, ఎం.టి.నాయక్, ఆంజనేయప్రసాద్, అరుణాకుమారి, సైదానాయక్, సురేశ్, విద్యార్థి సంఘం నాయకులు నరేందర్ నాయక్, భానుప్రకాశ్, విజయ్‌కుమార్, రేవంత్, మోహనకృష్ణ, వినోద్, రాజానాయక్‌లు పాల్గొన్నారు.

139

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles