ఇంటి రక్షణకు మొగ్గుచూపని దక్షిణాది ప్రజలు

Sat,February 23, 2019 12:09 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : డిజిటల్ యుగంలో ఇంటి భద్రత సెకండరీగా మారింది. కానీ.. దక్షిణ భారతదేశంలో దొంగతనాలు, దోపిడీల నుంచి ఇంటిని రక్షించుకునేందుకు ప్రజలు భద్రతా చర్యలు తీసుకునేందుకు మొగ్గుచూపడం లేదు. ప్రస్తుతం దొంగతనాలు, దోపిడీలకు చెక్ పెట్టేందుకు ఎన్నో అత్యాధునిక పద్ధతులు, పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ.. దానికనుగుణంగా ప్రజలు అటువైపు ఆసక్తి చూపడం లేదు. ఇటీవల గోద్రేజ్ లాక్స్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఓ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోద్రేజ్ లాక్స్ హర్ ఘర్ సురక్షిత్ 2018 నివేదిక(ఇండియాస్ సేఫ్టీ పారడాక్స్ - హోమ్ సేఫ్టీ వర్సెస్ డిజిటల్ సేఫ్టీ)లో దక్షిణ భారతదేశంలో 65 శాతం మంది ప్రజలు ఇంటి రక్షణకు చర్యలు తీసుకోవడం లే దని తేలింది. ఇందులో 57 శాతం మంది ప్రజలు ఇండ్ల రక్షణ కోసం అత్యాధునిక రక్షణ పరిష్కార మార్గాలకు సుముఖంగా లేరు. ఇదిలావుంటే.. సాధారణంగా దే శం మొత్తంలో మిగతా విషయాల్లో ఇతర ప్రాం తాల కంటే సాంకేతికను అందిపుచ్చుకోవడం లో దక్షిణ భారతదేశం అడ్వాన్స్‌గా ఉండడం గమనార్హం.

ఇతర ప్రాంతాల కంటే దక్షిణాదివారే..
గృహా భద్రత కోసం వినియోగించే డిజిటల్ లాక్స్ పట్ల దక్షిణ భారతదేశంలోని 82 శాతం మంది ప్రజలకు అవగాహన ఉన్నట్టు తేలింది. సౌకర్యం, ఉత్పాదకపరంగా దక్షిణాది ప్రజలు ఇతర ప్రాంతాల కంటే సాంకేతికలో ఎంతో ముందంజలో ఉన్నారు. అందులో భాగంగానే 25 శాతం మంది ప్రజలు కంప్యూటర్ పాస్‌వర్డ్‌ను మార్చుకుంటుండగా, 19 శాతం మంది రెండు నుంచి ఐదు నెలలకోకసారి బ్యాంకింగ్ పిన్ నంబర్లను మార్చుకుంటున్నారు. దాదాపు 51 శాతం మంది ప్రజలు స్మార్ట్‌ఫోన్లలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉపయోగిస్తున్నారు. కానీ అదే పద్ధతుల్లో హోమ్ లాకింగ్ సిస్టమ్ భద్రతకు వినియోగించకపోవడం గమనార్హం.

అధిక శాతం దొంగతనాలు ఇండ్లల్లోనే..
దేశంలో నిత్యం జరిగే దొంగతనాల్లో దాదాపు 70 శాతం ఇండ్లల్లోనే జరుగుతున్నాయి. కేవలం 30 శాతం దొంగతనాలు మాత్రమే డిజిటల్(సైబర్)గా చోటుచేసుకుంటున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా.. 61 శాతం మంది ప్రజలు ఇంటి భద్రత కోసం హైటెక్ భద్రతా పద్ధతులను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. దేశం మొత్తంలో ప్రజలు ఇండ్లల్లో ప్రాథమిక అంశాల భద్రతకు సంబంధించి అప్‌గ్రేడ్ కావడంలో వెనుకబడ్డారు. అయితే 40 శాతం మంది భారతీయులు మాత్రమే రెండు మూడేండ్లకోసారి ఇంటి తాళాలను మారుస్తుండగా, 20 శాతం మంది ఎప్పుడూ మార్చడం లేదు.

408

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles