త్వరలో ‘రవాణా’ పదోన్నతులు

Fri,February 22, 2019 01:21 AM

సిద్ధమవుతున్న
ఎంవీఐ,ఏఓల
సీనియారిటీ లిస్ట్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రవాణాశాఖలో పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే జేటీసీ, డీటీసీ పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక ప్రాంతీయ రవాణాశాఖ అధికారుల(ఆర్‌టీవోల) పదో న్నతుల కోసం కసరత్తు జరుగుతున్నది. అందుకోసం ఇప్పటికే సూత్రవూపాయంగా సీనియారిటీ జాబితాను రవాణాశాఖ ఉన్నతాధికారులు సిద్ధం చేసి ఉంచారు. మొత్తం 1 ఆర్‌టీవో పోస్టులు ఖాళీ ఉండగా వీటిని సీనియారిటీ ప్రాతిపాదికన మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్స్‌తోపాటు అడ్మినిస్ట్రేటివ్ అధికారులుగా పనిచేస్తున్నవారికి పదోన్నతులు లభించనున్నాయి. ఇందులో ఆరుమంది అడ్మిన్‌స్ట్రేటివ్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న అధికారులు ఆర్‌టీవో పదోన్నతుల జాబితాలో ఉండగా మిగతా పోస్టులు ఎంవీఐలతో నింపనున్నారు. కొత్త జిల్లాలు రావడంతో సరిపోయినంతమంది ఆర్‌టీవోలు లేకపోవడంతో సీనియర్ ఎంవీలను ఆర్‌టీవో ఇన్‌చార్జీలు వేసి నడిపిస్తున్నారు. ఇటీవలే మరో 5 మంది ఆర్‌టీవోలు పదోన్నతి పొందడంతో మరింత ఇబ్బందిగా మారింది. పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పటికే ఒక్కో ఆర్‌టీవో, ఎంవీఐ రెండు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇలా రెండు బాధ్యతలు నిర్వర్తించడం వల్ల వారు విధుల్లో ఇబ్బందిపడటమే కాకుండా సేవలను పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నారు. నగరంలోని దాదాపు అన్ని ఆర్‌టీవో కార్యాలయాల్లో ఇదే ఇంచార్జీల పాలన కొనసాగుతున్నది. పదోన్నతులు ఇచ్చి రెగ్యులర్ పోస్టుల్లో ఉంచాలని ఆలోచనతో వీలైనంత త్వరగా పదోన్నతులు ఇవ్వాలని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ జేటీసీ పరిధిలో అన్ని కార్యాలయాల్లో రెగ్యులర్ ఆర్‌టీవోలు లేక ఇంఛార్జీలతో నెట్టుకొస్తున్నారు. ఖైరతాబాద్ కార్యాలయం విషయానికి వస్తే ఎంవీఐ సురేష్‌డ్డికి రెండు బాధ్యతలు అప్పగించారు.చెక్‌పోస్టులో ఎంవీఐ బాధ్యతలతోపాటు ఖైరతాబాద్ ఆర్‌టీవోగా ఇన్‌ఛార్జి బాధ్యతలు మోస్తున్నారు. తిరుమలగిరి విషయానికి వస్తే ఖైరతాబాద్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న దుర్గావూపసాద్‌కు తిరుమలగిరి ఆర్‌టీవో బాధ్యతలు అప్పగించారు.

మలక్‌పేట విషయానికి వస్తే ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు బాధ్యతలు అప్పగించారు. టోలీచౌకీ ఆర్‌టీవో కార్యాలయం విషయానికి వస్తే ఎంవీఐ రవికుమార్‌కు ఆర్‌టీవో బాధ్యతలు ఇచ్చారు. ఈ అధికారి మరోచోట కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక బండ్లగూడ విషయానికి వస్తే అక్కడ పనిచేస్తున్న పుప్పాల శ్రీనివాస్ పదోన్నతిపై ఆదిలాబాద్‌కు వెళ్లడంతో అక్కడే పనిచేస్తున్న ఏవో సదానందంకు ఆర్‌టీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. నాగోల్ ఆర్‌టీవో బాధ్యతలు పదోన్నతిపొందిన పాపారావుకు అప్పగించారు. ఇక రంగాడ్డి విషయానికి వస్తే అత్తాపూర్‌లో ఆర్‌టీవో బాధ్యతలను డీటీసీ ప్రవీణ్‌రావు మోయాల్సి వస్తున్నది. మన్నెగూడలో ఇంచార్జీ ఆర్‌టీవో బాధ్యతను ఎంవీఐ గోవర్ధన్ రెడ్డికి అప్పగించారు. ఇక మేడ్చల్ విషయానికి వస్తే పదోన్నతిపై వెళ్లిన ఆర్‌టీవో స్థానంలో అక్కడే ఎంవీఐగా పనిచేస్తున్న కిషన్‌కు అప్పగించారు. ఉప్పల్ ఆర్‌టీవోగా ఇంచార్జీగా ఎంవీఐ విజయరావు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఏవోలు, సీనియర్ అసిస్టెంట్లు కూడా ఆన్‌డ్యూటీల పేర్లతో పోస్టింగ్‌లు ఇస్తున్నారు. ఐతే పదోన్నతులు లభిస్తే రెగ్యులర్ అర్‌టీవోలు వస్తారని సీనియర్ రవాణాశాఖ అధికారి తెలిపారు. ఐతే పార్లమెంటు ఎన్నికల తర్వాత పదోన్నతులు రావచ్చనే సంకేతాలు ఇచ్చారు

320

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles