క్యాన్సర్ మరణశాసనం కాదు


Fri,February 22, 2019 01:20 AM

-ఎంఎన్‌జే సేవలు భేష్
-క్యాన్సర్‌పై అవగాహన పెరగడం శుభపరిణామం
-ల్తీ ఆహారం, వాతావరణ కాలుష్యమే క్యాన్సర్ కారకాలను ప్రేరేపిస్తాయి
-సకాలంలో గుర్తిస్తే పూర్తిగా నియంత్రించ వచ్చు
-ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయ
నమస్తే తెలంతాణ-సిటీబ్యూరో: ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన సేవలు భేష్. దేశంలో ఈ హాస్పిటల్ ప్రత్యేక గుర్తింపు సాధించడం సంతోషకరం. నేను ఒకప్పుడు ఇదే హాస్పి టల్‌లో పీజీ చేశా. అప్పుడు ఇన్ని సౌకర్యాలు, సౌలభ్యాలు లేవు. ఇప్పుడు విదేశాలకు ఏమాత్రం తీసిపోకుండా ఇక్కడ సేవలు కల్పించడం రియల్లీ అమేజింగ్. అయితే క్యాన్సర్ ఇనిస్టిట్యూషన్స్ సంఖ్య మరింత పెరగాలి. రోగులు పెరుగుతున్నారు. కాని ఇనిస్టిట్యూషన్స్ సంఖ్య తక్కువగా ఉంది. క్యాన్సర్ అనేది ఇప్పుడు మరణశాసనమేమి కాదు. సకాలంలో గుర్తిస్తే వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చు....అని ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయ అన్నారు. గురువారం ఆయన నాంపల్లి, రెడ్ హిల్స్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌ను సందర్శించి అక్కడి వైద్య విద్యార్థులకు, వైద్యనిపుణులకు ఓరియెంటేషన్ క్లాస్ తీసుకున్నారు. దవాఖాన డైరెక్టర్ డాక్టర్ జయ లత, ఆర్‌ఎంఒ డా.నిర్మల, సీఎస్ ఆర్‌ఎంఓ డా.శ్రీనివాస్, రేడియేషన్ ఆంకాలజిస్టు విభాగం అధిపతి డాక్టర్ సంజీవినికుమారి, రేడియేషన్ ఆంకాలజిస్టు డా.సాయిరామ్ లతో కలిసి ఆయన దవాఖానను కలియతిరిగారు.
దవాఖానలో అందుతున్న సేవలు, అధునాతన వైద్యపరికరాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు అడిగిన అనుమానాలను నివృతి చేశారు. అనంతరం డాక్టర్ నోరి దత్తాత్రేయ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ భారత్‌లో క్యాన్సర్‌పై అవగాహన పెరుగుతోందని, ఇది శుభపరిణామమన్నారు. అమెరికాలో 1.3మిలియన్ ప్రజలు క్యాన్సర్‌తో బాధపడు తుండగా వారిలో 0శాతం మంది రోగులు వ్యాధిని సకాలంలో గుర్తించి, సరైన చికిత్స తో పూర్తి ఆరోగ్యంగా ఉన్నారన్నారు. భారత్‌లో రోగులకు సంబంధించి ఖచ్చిత మైన గణాంకాలు లేవని, స్క్రీనింగ్ చేయించుకోని వారు చాలా మంది ఉన్నట్లు ఆయన తెలిపారు. వాతావరణ కాలుష్యం, కల్తీ ఆహారం వంటివి మనిషి శరీరంలోని క్యాన్సర్ కారకాలను ప్రేరేపించి వ్యాధికి గురిచేస్తాయని డా.నోరి దత్తాత్రేయ వివరించారు. ఈ క్రమంలోనే భారత దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందన్నారు. ముఖ్యంగా మన దేశంలో చాలా రకాల క్యాన్సర్‌లు మానవ తప్పిదాల వల్లనే వస్తుంటాయని అం దులో ముఖ్యంగా పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులు వినియోగించడం, గుట్కా, పాన్‌మసాలాలు, మద్యపానం తదితరాల వల్ల పలు రకాల క్యాన్సర్ వ్యాధులు వస్తున్నట్లు వివరించారు.


పిల్లల్లో బోన్ మ్యారో ద్వారా.....
కాలుష్యం, విష రసాయనాలు పిల్లల బోన్‌మ్యారోలోకి వెళ్లి వారిలో వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులను పుట్టిస్తాయని డా.దత్తాత్రేయ వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో చిన్నపిల్లల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం కాలుష్యం, కల్తీ ఆహారం, జీవన శైలే ప్రధాన కారణమన్నారు.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తగ్గుముఖం
భారత్‌లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు ఆయన వెల్లడించారు. దీనికి ప్రజల్లో పెరుగుతున్న అవగాహననే ప్రధాన కారణమని, ఇది శుభపరిణామమన్నారు. అయితే అవగాహన విషయంలో విదేశాలతో పోల్చితే మన దేశం ఇంకా వెనకబడే ఉందన్నారు. రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగు తోందని ఆయన వాపోయారు.

కీమో, రేడియోషన్ థెరపీలకు ప్రత్యమ్నాయం ఇమ్యునో థెరపీ
కీమో, రేడియోషన్ థెరపిలతో రోగి అధికంగా దుష్ప్రభావాలకు గురవుతాడు. దీంతో రోజురోజుకు రోగి బలహీనమవుతాడు. దీనికి ప్రత్యమ్నాయంగా ఇప్పుడు ఇమ్యునో థెరపీ అందుబాటులోకి వచ్చిందని డా.దత్తాత్రేయ వివరించారు. ఈ థెరపి ద్వారా రోగిలోని వ్యాధి నిరోధక శక్తి పెంచడంతో పాటు క్యాన్సర్ కారకాలపై మాత్రమే ఫోకస్ చేసి రేడియేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. దీనివల్ల దుష్ప్రభావాలు పెద్దగా ఉండవన్నారు.
క్యాన్సర్ వ్యాధి వచ్చినంత మాత్రాన అదేమి మరణ శాసనం కాదని, సకాలంలో గుర్తిస్తే ఎంతటి క్యాన్సర్ వ్యాధినైనా నియంత్రించవచ్చన్నారు. ప్రస్తుతం రోగుల సంఖ్య పెరు గుతున్నందున స్క్రీనింగ్ సెంటర్స్, చికిత్స కేంద్రాలు కూడా పెరగాలన్నారు. ప్రతి జిల్లాకు ఒక స్క్రీనింగ్ సెంటర్ ఉండాలని, ప్రతి జిల్లా దవాఖానలో ఆంకాలజి విభాగం ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాం తాల్లో పనిచేసే ప్రతి వైద్యునికి క్యాన్సర్ వ్యాధులకు సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఉండే విధంగా శిక్షణ ఇవ్వాలని దీనివల్ల అక్కడి ప్రజలకు వారు సకాలంలో వ్యాధులను గుర్తిం చడమే కాకుండా ప్రాథమిక స్థాయిలో చికిత్స అందించగలుగుతారన్నారు. ఫలితంగా రోగుల్లో వ్యాధి తీవ్రత పెరగకుండా ఉంటుందన్నారు.

928

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles